Ind vs Aus: ఆస్ట్రేలియాను కలవరపెడుతున్న బుమ్రా గణాంకాలు.. ఆసీస్ బ్యాట్స్‌మన్‌లకు ఇక దబిడదిబిడే!!

హైదరాబాద్: జస్ప్రీత్ బుమ్రా.. ఈ పేరు గురించి సగటు క్రికెట్ అభిమానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యార్కర్ కింగ్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అని బుమ్రాకు బిరుదులు ఉన్నాయి. అంతేకాదు ప్రపంచ టాప్ బౌలర్లలో ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి బుమ్రా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. 27 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. టాప్, మిడిల్, లోయర్ ఆర్డర్.. బ్యాట్స్‌మన్ ఎవరైనా బుమ్రా బంతికి బలయ్యారు. ఇక సుదీర్ఘ పర్యటన కోసం టీమిండియా.. ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే బుమ్రా గణాంకాలు ఆస్ట్రేలియాను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా వన్డే గణాంకాలు. నవంబర్ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్:
జస్ప్రీత్ బుమ్రా 64 వన్డేల్లో 24.43 సగటుతో 104 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ కేవలం 4.55 మాత్రమే. సిడ్నీ వేదికగా 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. ఆ తర్వాత తన పదునైన బౌలింగ్‌లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్‌గా ఎదిగాడు. మరి ఎక్కువగా రన్నప్ తీసుకోకున్నా.. గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతాడు. ఇదే అతడి బౌలింగ్ ప్రత్యేకత. ఇక క్రీజులో విద్వంసకర ఓపెనర్ ఉన్నా.. టాప్ క్లాస్ .బ్యాట్స్‌మన్ ఉన్నా వాళ్ల ఆటలు మనోడి ముందు సాగవు. బుమ్రా బౌలింగ్లో ఆచితూచి ఆడాల్సిందే. ఇప్పటికే 64 వన్డేలు, 50 టీ20, 14 టెస్టులు ఆడిన బుమ్రా ప్రస్తుతం వన్డేల్లో టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

వన్డేల్లో 100 వికెట్ల మైలురాయి:
వన్డే కెరీర్‌లో వందో వికెట్ పడగొట్టిన బుమ్రా అరుదైన జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. భారత్ తరఫున తక్కువ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో ఫాస్ట్ బౌలర్‌గా రికార్డ్‌ల్లో నిలిచాడు. ఈ జాబితాలో మొహమ్మద్ షమీ (56 వన్డేల్లో) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 57 వన్డేలతో బుమ్రా నిలిచాడు. ఈ ఇద్దరి తర్వాత వరుసగా ఇర్ఫాన్ పఠాన్ (59), జహీర్ ఖాన్ (65), అజిత్ అగార్కర్ (67) టాప్-5లో కొనసాగుతున్నారు. బుమ్రా గణాంకాలు కచ్చితంగా ఆసీస్ బ్యాట్స్‌మన్‌లను కలవరపెడుతాయి.

52 మంది 10 పరుగుల కంటే తక్కువ:
బుమ్రా తీసిన 104 వికెట్లలో 53 టాప్-6 బ్యాట్స్‌మన్‌లవే ఉన్నాయి. అంటే కీలకమైన వికెట్లు అతడు తీస్తాడు. కీలక వికెట్లు తీయడమే కాకుండా.. బ్యాట్స్‌మన్ క్రీజులో కుదురుకోకముందే వారిని పెవిలియన్ చేర్చుతాడు. 104 వికెట్లలో 52 మంది 10 పరుగుల కంటే ఎక్కువ చేయలేకపోయారు. ఈ గణాంకాలు కొత్త బంతితో బుమ్రా ఎలా చెలరేగుతాడో చెపుతాయి. మరో 31 మంది 10-29 పరుగుల వ్యవధిలో ఔట్ అయ్యారు. బుమ్రా 104 వికెట్లలో 83 మంది బ్యాట్స్‌మన్లు 30 రన్స్ లోపు పెవిలియన్ చేరారు. ఇది అద్భుతమైన రికార్డు!.

మ్యాచ్ విన్నర్:
సిడ్నీలో ఆస్ట్రేలియాపై 2016 జనవరి 23న అరంగేట్రం చేసినప్పటి నుంచి బుమ్రా వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. సమకాలీన వన్డే క్రికెట్‌లో ఈ గణాంకాలు నమోదు చేయడం అసాధ్యం. వికెట్లు, ఎకానమీ, యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ అన్ని కూడా బుమ్రాను వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా నిలిపాయి. షాన్ పొల్లాక్, మఖాయ ఎంతిని, క్రెయిగ్ మెక్‌డెర్మాట్, షోయబ్ అక్తర్, మిచెల్ జాన్సన్, జాసన్ గిల్లెస్పీ వంటి ఆల్-టైమ్ బౌలర్ల కంటే బుమ్రా బౌలింగ్ సగటు మెరుగ్గా ఉంది. అతని బౌలింగ్ స్ట్రైక్ రేట్ లసిత్ మలింగ, మఖాయ, కమిన్స్, రబాడా కంటే తక్కువగా ఉంది. మొత్తానికి బుమ్రా టీమిండియాకు నిజమైన మ్యాచ్ విన్నర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
India vs Australia: టెస్టులకు సాహా సిద్ధం.. పంత్‌కు షాక్!!