For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాపై పైచేయి సాధించాలంటే.. భారీ స్కోర్లు తప్పక చేయాలి!! లేదంటే: స్మిత్

India vs Australia: Steve Smith says Definitely have to scores big when playing against India

సిడ్నీ: టీమిండియాపై పైచేయి సాధించాలంటే.. ఎప్పుడైనా సరే భారీ స్కోర్లు తప్పక చేయాలని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్‌ స్టీవ్ స్మిత్ అంటున్నాడు. ఐపీఎల్ 2020‌లో భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించానని, ఆ సమయంలో కుదరలేదని స్మిత్ పేర్కొన్నాడు. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

మొదటగా ఆస్ట్రేలియా 389/4 స్కోరు చేయగా.. భారత్‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 338 పరుగులే చేసి ఓటమిపాలైంది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' స్టీవ్‌ స్మిత్‌ (64 బంతుల్లో 104; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారీ స్కోర్లు సాధించాలి

భారీ స్కోర్లు సాధించాలి

మ్యాచ్‌ అనంతరం తన ప్రదర్శనపై స్టీవ్ స్మిత్ మాట్లాడాడు. 'ఎదుర్కొన్న తొలి బంతి నుంచే మంచి టచ్‌లో ఉన్నట్లు అనిపించింది. మా ఓపెనర్లు ఆరోన్ ఫించ్‌, డేవిడ్ వార్నర్‌ ఇచ్చిన ఘనమైన ఆరంభం వల్లే నేను, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ గొప్పగా ఆడాం. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటమే మా ముందు ఉన్న పని. భారత్‌కు వ్యతిరేకంగా ఆడినప్పుడు మాత్రం కచ్చితంగా భారీ స్కోర్లు సాధించాలి. అలా చేస్తేనే మ్యాచ్‌లో పైచేయి సాధించగలం. అదృష్టవశాత్తు గత రెండు మ్యాచ్‌ల్లోనూ మేం ఇలానే చేశాం' అని స్మిత్ తెలిపాడు.

రికార్డుల గురించి పట్టించుకోవట్లేదు

రికార్డుల గురించి పట్టించుకోవట్లేదు

ఆస్ట్రేలియా తరఫున వరుసగా రెండు సెంచరీలు సాధించిన స్టీవ్ స్మిత్‌.. ఐపీఎల్ 2020‌లో ఆశించిన స్థాయిలో రాణించని సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2020‌లో భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించా. ఇప్పుడు మరింత ఫిట్‌నెస్‌ సాధించి ఆడుతున్నా. ఇది ప్రయోజనకరంగా ఉంది. కేవలం క్రికెటింగ్‌ షాట్లే ఆడుతున్నా. రికార్డుల గురించి పట్టించుకోవట్లేదు. జట్టు కోసం పరుగులు చేయడం సంతోషంగా ఉంది. మా జట్టు ఆటగాళ్లందరూ గొప్పగా ఆడుతున్నారు' అని స్మిత్ చెప్పుకొచ్చాడు. టీమిండియాపై స్మిత్ గత ఐదు ఇన్నింగ్స్‌లో 69, 98, 131, 105, 104 పరుగులు చేశాడు.

అత్యంత వేగంగా సెంచరీ

అత్యంత వేగంగా సెంచరీ

62 బంతుల్లో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్‌ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరపున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో 51 బంతుల్లోనే శతకం బాదిన గ్లెన్ మాక్స్‌వెల్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. జేమ్స్ ఫాల్కనర్ (57) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. స్మిత్ మూడు (62), నాలుగు (62) స్థానాల్లో ఉన్నాడు. మాథ్యూ హేడెన్ 66 బంతుల్లోనే సెంచరీ చేసి ఐదవ స్థానంలో ఉన్నాడు.

టీమిండియాపైనే 5 శతకాలు

టీమిండియాపైనే 5 శతకాలు

ఓవరాల్‌గా వన్డేల్లో స్టీవ్ స్మిత్‌ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా.. అందులో టీమిండియాపైనే 5 సాధించాడు. భారత్‌పై 5 కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఆసీస్‌ ఆటగాళ్లలో రికీ పాంటింగ్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. పాంటింగ్‌ టీమిండియాపై ఆరు సెంచరీలు సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే పాంటింగ్‌ 6 సెంచరీలు సాధించడానికి 59 మ్యాచ్‌లు తీసుకోగా.. స్మిత్‌ 20 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును సాధించడం విశేషం.

Story first published: Monday, November 30, 2020, 13:08 [IST]
Other articles published on Nov 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+