Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్సీకి బ్యాటర్ల కంటే బౌలర్లే ఉత్తమం: జస్‌ప్రీత్ బుమ్రా

సారథ్య బాధ్యతలు బ్యాటర్ల కంటే బౌలర్లకు అప్పగించడమే ఉత్తమమని టీమిండియా తాత్కలిక టెస్ట్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. బ్యాటర్ల కంటే బౌలర్లే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని చెప్పాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలోని తొలి మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు.

రెండో సారి తండ్రైన రోహిత్ శర్మ కుటుంబంతో గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరికొద్ది గంటల్లో పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి తెరలేవనుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియాను జస్‌ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు.

India vs Australia Jasprit Bumrah Says Fast Bowlers Make Effective Captains Than Batters

కెప్టెన్సీ నాకు గౌరవం..
ఈ క్రమంలోనే గురువారం నిర్వహించిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్సీ హోదాలో బుమ్రా పాల్గొన్నాడు. టీమ్ ప్రిపరేషన్స్‌తో పాటు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సారథ్య బాధ్యతలు స్వీకరించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు.

'కెప్టెన్సీ బాధ్యతలను నేను గౌరవంగా భావిస్తాను. సారథిగా నాకంటూ ప్రత్యేకమైన శైలి ఉంది. కెప్టెన్సీ విషయంలో కోహ్లీ, రోహిత్‌లు వేరు. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కెప్టెన్సీని ఒక పదవిలా కాకుండా బాధ్యతగా భావిస్తాను. కెప్టెన్సీ గురించి రోహిత్ శర్మతో మాట్లాడాను. కానీ ఇక్కడికి వచ్చాకే నేను సారథ్యం వహించడంపై స్పష్టత వచ్చింది.

పేసర్లు వ్యూహాత్మకంగా బెటర్..
పేసర్లు కెప్టెన్‌గా ఉండాలని నేను చాలా రోజులుగా చెబుతున్నాను. బ్యాటర్ల కంటే పేసర్లే వ్యూహాత్మకంగా మెరుగు. మైదానంలో వారి వ్యూహాలు చాలా భిన్నంగా ఉంటాయి. ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. గతంలో కపిల్ దేవ్‌తో పాటు చాలా మంది పేసర్లు సారథులుగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. టీమిండియాలో ఈ కొత్త సంప్రదాయానికి ఇది ఆరంభం అనుకుంటున్నాను.

ఆ ఓటమితో ఏం ఫరక్ పడదు..
న్యూజిలాండ్‌తో ఎదురైన పరాజయం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై ఏ మాత్రం ప్రభావం చూపదు. ఎందుకంటే గెలిచినా.. ఓడినా మళ్లీ సున్నాతోనే మొదలుపెట్టాలి. భారత్‌లో ఎదురైన ఘోర ఓటమి భారాన్ని ఇక్కడికి మోసుకురాలేదు. కాకపోతే ఆ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. అయితే అక్కడి పరిస్థితులు వేరు. ఇక్కడ భిన్నమైన పరిస్థితుల్లో ఆడబోతున్నాం. ఫలితాలు కూడా భిన్నంగా ఉంటాయి. తుది జట్టుపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాం. కానీ టాస్ సమయంలోనే తుది జట్టును వెల్లడిస్తాం.'అని జస్‌ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, November 21, 2024, 18:14 [IST]
Other articles published on Nov 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+