India vs Australia: మూడో టెస్ట్ ముందు ఆసీస్‌కు భారీ షాక్.. గాయంతో మరో స్టార్ పేసర్ ఔట్!

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును గాయాల బెడద వీడటం లేదు. ఇప్పటికే స్టార్ ప్లేయర్ల గాయాలతో సతమతమవుతున్న ఆ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది. భారత్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్ట్‌కు ఆసీస్.. స్టార్ పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ సేవలు కోల్పోయింది. గాయం కారణంగానే తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన ప్యాటిన్సన్ పూర్తిగా కోలుకొని మూడో టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చాడు. క్రికెట్ ఆస్ట్రేలియా 18 మంది సభ్యులతోనే ప్రకటించిన జట్టులోను చోటు దక్కించుకున్నాడు. కానీ అంతలోనే మళ్లీ గాయపడ్డాడు.

ఇంట్లో జారి పడటంతో
బోర్దు ఆమోదంతో సెలవులో ఉన్న అతను ఇంట్లో జారిపడటంతో పక్కటెముకలకు తీవ్రగాయమైంది. దాంతో ప్యాటిన్సన్ మూడో టెస్ట్‌కు కూడా దూరం కానున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. సిరీస్‌లో చివరిదైన బ్రిస్బేన్ టెస్ట్ ఆడేది లేనిది అతని గాయం పురోగతిని బట్టి నిర్ణయిస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘పక్కటెముకల గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ భారత్‌తో జరిగే మూడో టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఎవరిని తీసుకోవడం లేదు. బ్రిస్బేన్ టెస్ట్ ముందు మరోసారి అతని గాయాన్ని అంచనా వేసి తుది నిర్ణయం తీసుకుంటాం'అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

ముగ్గురు పేసర్లతోనే..
ప్యాటిన్సన్‌కు బ్యాకప్‌గా మైకెల్ నెసెర్, సీన్ అబాట్‌లు ఉన్నారు. కానీ ఆసీస్.. ముగ్గురు పేసర్లు, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హెజెల్ వుడ్, ఒక స్పిన్నర్ నాథన్ లియోన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరొకటి గెలిచాయి. అడిలైడ్ టెస్ట్‌లో భారత్ చిత్తుగా ఓడగా.. మెల్‌బోర్న్‌లో భారత్ 8 వికెట్లతో అద్భుతవిజయాన్నందుకుంది. దాంతో సిరీస్ 1-1తో సమమైంది. దాంతో సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్ట్ ఇరు జట్లకు కీలకమే.

ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్
టిమ్ పైన్(కెప్టెన్), సీన్ అబాట్, ప్యాటి కమిన్స్, కామెరూన్ గ్రీన్, మార్కస్ హ్యారిస్, జోష్ హెజల్‌వుడ్, ట్రావిస్ హెడ్, హెన్రీక్స్, మార్నస్ లబుషేన్, మైకెల్ నెసెర్, జేమ్స్ ప్యాటిన్సన్, విల్ పుకోవిస్కీ, స్టీవ్ స్మిత్, మైకెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications