India vs Australia:రోహిత్ మార్క్ కెప్టెన్సీ.. నెట్స్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్.. ఎందుకంటే?

మొహాలీ: ఆసియా కప్ 2022లో నిరాశపరిచిన టీమిండియా ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌పై కన్నేసింది. వచ్చే నెలలో జరిగే ఈ మెగా టోర్నీకి ఫైనల్ రౌండ్ ప్రిపరేషన్స్‌కు రెడీ అయ్యింది. టీమ్ కాంబినేషన్స్ సెట్ చేసుకోవడంతో పాటు తమ ప్లాన్స్‌కు తుది రూపు ఇవ్వడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది.
పేరుకు ఆసీస్‌తో పోటీ అయినప్పటికీ టీమ్ ఫోకస్ మొత్తం వరల్డ్‌కప్‌పైనే ఉంది. మెగా టోర్నీ ముందు ఆసీస్, సౌతాఫ్రికాతో జరిగే ఆరు టీ20 మ్యాచ్‌ల్లో పూర్తి జట్టును పరీక్షించి కాంబినేషన్‌పై ఓ అంచనాకు రావాలని చూస్తోంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మరికొద్ది సేపట్లో మొహాలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా..
అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేత బౌలింగ్ చేయించేందుకు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ ప్రయత్నిస్తున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. టీమ్‌లో ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా విరాట్‌ను రెడీ చేయాలని వీళ్లు ప్రణాళికలు రచిస్తున్నట్లు అర్థమవుతోంది. ఆసీస్‌తో తొలి టీ20 నేపథ్యంలో కోహ్లీ 30-40 నిమిషాల పాటు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. సరదాగా కాకుండా సీరియస్‌గా ద్రవిడ్ పర్యవేక్షణలో కోహ్లీ బౌలింగ్ చేశాడు. ఈ వీడియోను చూస్తుంటే టీమ్‌మేనేజ్‌మెంట్ కోహ్లీని బౌలర్ వాడుకోవాలనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
40 నిమిషాల పాటు ప్రాక్టీస్..
రాహుల్ ద్రవిడే కాకుండా.. హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ సైతం కోహ్లీ బౌలింగ్‌ను పరీక్షించారు. మీడియం పేస్ బౌలింగ్ వేసే సామర్థ్యం కోహ్లీకి ఉండటం.. ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆస్ట్రేలియా పిచ్‌లు పేస్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు ఆరేళ్ల తర్వాత ఆసియాకప్‌లో హాంగ్‌కాంగ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన విరాట్ ఆకట్టుకున్నాడు. సీనియర్ బౌలర్లు విఫలమైన వేల కట్టడిగా బౌలింగ్ చేసి ఔరా అనిపించాడు. ఎక్స్‌ట్రా బ్యాటర్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే కోహ్లీని బౌలర్‌గా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ ఇద్దరి కోసమే..
నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు, ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగనున్న టీమిండియా.. ఎక్స్‌ట్రా బ్యాటర్ తీసుకోవాలంటే పార్ట్ టైమ్ బౌలింగ్ చేయగల ఆటగాడు కావాలి. ఆ క్రమంలోనే విరాట్‌తో ఒకటి రెండు ఓవర్లు వేయించాలని రోహిత్ శర్మ వ్యూహాలు రచిస్తున్నాడు. కోహ్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేస్తే వికెట్ కీపర్లు రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లను ఆడించవచ్చని, లేకుంటే ఒక్కరే జట్టులోకి వస్తారనేది టీమ్‌మేనేజ్‌మెంట్ ఆలోచన. మరీ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కోహ్లీ బ్యాటర్‌గా కాకుండా బౌలర్‌గా ఎలా రాణిస్తాడో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications