Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: మళ్లీ దెబ్బతీసిన రనౌట్.. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఖేల్ ఖతం!

India seal 131-run lead despite lower-order collapse

మెల్‌బోర్న్: పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియాను మరోసారి రనౌటే దెబ్బతీసింది. అడిలైడ్ టెస్ట్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అజింక్యా రహానే కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ రనౌట్ అవ్వడం.. ఆ తర్వాత స్వల్ప పరుగుల వ్యవధిలోనే భారత్ కుప్పకూలడం.. అది చిత్తుగా ఓడటానికి కారణమవ్వడం తెలిసిందే. ఇక తాజా బాక్సింగ్ డే టెస్ట్‌లో కూడా అదే రనౌట్ సీన్ రీపిట్ అయింది. నాయకుడిగా ముందుండి అద్భుత సెంచరీతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన తాత్కలిక కెప్టెన్ రహానే(112) రనౌటవ్వడంతో భారత్ భారీ స్కోర్‌కు బ్రేక్ పడింది. ఆ వెంటనే రవీంద్ర జడేజా(57) కూడా పెవిలియన్ చేరడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 326 పరుగులకే ముగిసింది. ఫలితంగా రహానే సేనకు 131 పరుగుల ఆధిక్యం లభించింది.

క్లోజ్‌డ్ కాల్..

క్లోజ్‌డ్ కాల్..

277/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. 17 పరుగుల వ్యవధిలోనే సెంచరీ హీరో రహానే వికెట్ కోల్పోయింది. లయన్ వేసిన 100వ ఓవర్ చివరి బంతిని జడేజా క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకున్న లబుషేన్ వేగంగా కీపర్‌ పైన్‌కు అందజేయడంతో అతను అంతేవేగంగా వికెట్లను కొట్టేశాడు. నాన్‌స్ట్రైకర్ రహానే రనౌట్‌ కాకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫీల్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించి ఔట్‌గా ప్రకటించాడు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్‌లో టిమ్ పైన్ ఇదే తరహాలో అయిన రనౌట్‌ను బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాట్స్‌మెన్ కింద నాటౌట్ ఇవ్వడం విమర్శలకు దారితీసింది. తాజా రనౌట్ కూడా ఇంచు మించు అలానే ఉంది. కానీ అంపైర్ ఈసారి ఔటివ్వడం చర్చనీయాంశమైంది.

జడేజా హాఫ్ సెంచరీ..

కమిన్స్ వేసిన ఆ మరుసటి ఓవర్ ఫస్ట్ బాల్‌నే జడేజా ఫైన్ లెగ్ మీదుగా ఆడి సింగిల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన మార్క్ కత్తిసాము సెలెబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ఈ సింగిల్‌తో భారత్ ఆధిక్యం 100 పరుగులకు చేరడం గమానార్హం. హాఫ్ సెంచరీ తర్వాత మరో ఏడు పరుగుల వ్యవధిలోనే జడేజా ఇన్నింగ్స్ ముగిసింది. స్టార్క్ వేసిన బౌన్సర్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా ఆడిన జడేజా.. కమిన్స్ చిక్క వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉమేశ్‌తో అశ్విన్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. వ్యక్తిగత పరుగులు 5 వద్ద లయన్ బౌలింగ్‌లో అశ్విన్ ఇచ్చిన సునాయస క్యాచ్ లబుషేన్ జారవిడిచాడు.

1రన్.. 3 వికెట్స్..

1రన్.. 3 వికెట్స్..

ఆ అవకాశాన్ని అశ్విన్ అందిపుచ్చుకోలేకపోయాడు. లయన్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్(9)స్లిప్ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరగ్గా.. హజల్ వుడ్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే అశ్విన్(14) లయన్‌కు క్యాచ్ వెనుదిరగాడు. లయన్ వేసిన ఆ తరువాతి ఓవర్‌లోనే బుమ్రా(0) ట్రావిస్ హెడ్‌కు చిక్కడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. పరుగు వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇది టీమిండియా లోయరార్డర్ బలహీనతను తెలియజేస్తుంది. ఈ ముగ్గురిలో ఒక్కరు కనీసం 20 పరుగులు చేసినా భారత్‌కు భారీ ఆధిక్యం లభించేది. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 49 పరుగులే వ్యవధిలోనే భారత్ ఇన్నింగ్స్ ముగియడం గమనార్హం.

Story first published: Monday, December 28, 2020, 8:21 [IST]
Other articles published on Dec 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+