India vs Australia: బాక్సింగ్‌డే టెస్ట్‌లో భారత్ ఘన విజయం!

మెల్‌బోర్న్: అడిలైడ్ ఘోర పరాజయాన్ని మరిపిస్తూ భారత్ అద్భుత విజయాన్నందుకుంది. దెబ్బ తిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాకు రుచి చూపిస్తూ పర్‌ఫెక్ట్ రివేంజ్ తీర్చుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకున్నా.. తాత్కలిక సారథి అజింక్యా రహానే నేతృత్వంలోని భారత్ సమష్టిగా చెలరేగి బాక్సింగ్‌డేలో ఆసీస్‌ను మట్టికరిపించింది. రహానే సమయోచిత బ్యాటింగ్‌కు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మూడున్నర రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 8 వికెట్లతో అలవోక విజయాన్నందుకుంది.
70 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. శుభ్‌మన్ గిల్(36 బంతుల్లో 35 నాటౌట్), అజింక్యా రహానే(40 బంతుల్లో 27) భారత్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరొక వికెట్ తీశారు. ఈ గెలుపుతో నాలుగు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్ 1-1తో సమం అయింది. సెంచరీ హీరో రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

ఆదిలోనే షాక్..
70 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ప్రారంభమైన 5 ఓవర్‌లోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. స్టార్క్ వేసిన ఈ ఓవర్ రెండో బంతి మయాంక్ బ్యాట్ తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఆ మరుసటి ఓవర్‌లోనే టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా(3)ను కమిన్స్ ఔట్ చేయడంతో మరో దారుణ ప్రదర్శన రిపీట్ అవుతుందా? అనే సందేహం కలిగింది. కానీ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగి బౌండరీలు రాబట్టడం.. అతనికి తోడుగా రహానే ఆచితూచి ఆడటంతో భారత్ విజయం సులువైంది. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు.

ఆసీస్ 200 ఆలౌట్..
అంతకు ముందు 133/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 67 పరుగులు జోడించి 200 రన్స్‌కు సెకండ్ ఇన్నింగ్స్ ముగించింది. కామెరూన్ గ్రీన్(45), కమిన్స్(22) కొంత విసిగించినా.. భారత బౌలర్లు సమష్టిగా రాణించి ఫలితాన్ని రాబట్టారు. హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, అశ్విన్, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఉమేశ్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ 131 పరుగుల ఆధిక్యం తీసేయగా ఆసీస్‌కు 69 పరుగుల లీడ్ ఉంది. దాంతో భారత్ ముందు 70 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది.

విసిగించిన టెయిలండర్లు..
నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లను ఆసీస్ టెలండర్లు విసిగించారు. పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమవుతూ భారత్ విజయాన్ని ఆలస్యం చేశారు. జిడ్డు బ్యాటింగ్‌తో సతాయిస్తున్న కమిన్స్(103 బంతుల్లో 22)ను బుమ్రా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. కానీ క్రీజులోకి వచ్చిన స్టార్క్‌తో గ్రీన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న గ్రీన్ (146 బంతుల్లో 5 ఫోర్లతో 45)ను సిరాజ్ షార్ట్ పిచ్ బంతితో బోల్తా కొట్టించాడు. అతని బంతికి టెంప్ట్ అయి భారీ షాట్ ఆడిన గ్రీన్.. ఫార్వార్డ్‌లో జడేజాకు చిక్కాడు. ఆ తర్వాత లయన్‌ను సిరాజ్, హేజిల్‌వుడ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపడంతో ఆతిథ్య జట్టు కథ ముగిసింది.
సంక్లిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 195 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 200 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 326 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 70/2
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications