అతను జట్టును నడిపించడానికే పుట్టాడు: ఆసీస్ మాజీ కెప్టెన్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లతో గెలుపొంది బదులు తీర్చుకుంది. రెండో టెస్ట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్యా రహానేపై సర్వత్రా ప్రశంసలు వర్షం కురుస్తూనే ఉంది. విరాట్ కోహ్లి గైర్హాజరీతో జట్టును ఎలా ముందుకు తీసుకెళతాడో అన్న వాళ్లకి రహానే మ్యాచ్ గెలిపించి చూపించాడు. కాగా, ఆ మ్యాచ్‌లో సెంచరీతో జట్టును గట్టెక్కించి విజయంలో కీలక పాత్ర పోషించిన రహానేను ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ కొనియాడాడు. క్రికెట్ కోసమే రహానే పుట్టాడని చాపెల్ అభినందించాడు. ఈసీపీఎన్ క్రికెట్ ఇన్ఫోకు రాసిన కాలమ్‌లో రహానేను చాపెల్ ప్రత్యేకంగా ప్రశంసించాడు.

రహానే కెప్టెన్సీ సూపర్..
‘రహానే చాలా ధైర్యవంతుడే కాదు.. ఒక స్మార్ట్ క్రికెటర్ కూడా. క్రికెట్ జట్లను నడిపించడానికే పుట్టాడు. 2017లో ధర్మశాలలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూడా రహానే సారథ్యం వహించి జట్టును గెలిపించాడు. 2017లో ఆ మ్యాచ్‌కు మొన్న ఎంసీజీలో జరిగిన మ్యాచ్‌కు చాలా దగ్గర పోలికలున్నాయి. ఆసీస్ క్రికెటర్లు వార్నర్-స్మిత్‌లు సెంచరీకి పైగా భాగస్వామ్యం నమోదు చేసిన దశలో కుల్దీప్ యాదవ్‌కు బౌలింగ్ ఇచ్చి ఆ జోడిని విడగొట్టాడు.

అదే రహానే సక్సెస్‌కు కారణం..
కుల్దీప్ బౌలింగ్‌లో వార్నర్ స్లిప్‌లో రహానేకే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ సమయంలో కుల్దీప్ యాదవ్‌తో బౌలింగ్ చేయించడం చాలా గొప్ప ముందుచూపు. అదే అతని కెప్టెన్సీ సక్సెస్‌కు కారణం కూడా. ఆ నేపథ్యంలో టీమిండియాకు రహానే కెప్టెన్‌గా చేయడంలో ఆశ్చర్యం ఏమీలేదు. అతనికి కెప్టెన్‌గా చేసే అన్ని అర్హతలు ఉన్నాయి. అతను సారథ్యం వహించే జట్టుకు ఎంతో గౌరవం ఇస్తాడు' అని ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు.

రిపీట్ చేస్తే..
ఈ సిరీస్‌లో భారత్ ఇంకా కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ఓపెనింగ్ జోడీ, స్టార్ పేసర్ల గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ ఆసీస్‌తో పోలిస్తే అదేం అంత పెద్ద సమస్య కాదు. టీమిండియా ప్రశాంతమైన నాయకుడు రహానే ఉన్నాడు. అలానే కోహ్లీ-రహానే-రవిశాస్త్రి సంయుక్తంగా సిద్దం చేసిన జట్టు ఉంది. గత పర్యటన పునరావృతం చేస్తే తిరుగుండదు.'అని ఇయాన్ చాపెల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications