
మ్యాచ్ సజావుగా సాగేలా..
ఈ క్రమంలోనే మ్యాచ్ సజావుగా సాగేలా ప్రభుత్వం నుంచి సాయం అందించాలని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు. ప్రత్యేకంగా కలిసి మరీ విజ్ఞప్తి చేశారు. మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తగు సౌకర్యాలు కల్పించాలని అజారుద్దీన్ అభ్యర్థించారు. అజారుద్దీన్ అభ్యర్థనకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. మ్యాచ్ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై ఇద్దరం చర్చించుకున్నామని.. ప్రభుత్వం తరఫున హెచ్‌సీఏకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు.

సానుకూలంగా మంత్రి..
ఈ మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా గట్టి బందోబస్తు కల్పించాలని పోలీసులు, జీహెచ్ఎంసీ, ఫైర్, తదితర శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 2019 డిసెంబర్ లో ఇండియా - ఆస్ట్రేలియా మధ్యే ఇక్కడ చివరి మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత మళ్లీ మ్యాచ్ జరగలేదు. కరోనా కారణంగా ఐపీఎల్ ఆతిథ్యం భాగ్యనగరానికి దక్కలేదు. ఈ సిరీస్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే మొహాలీకి చేరుకుని ప్రాక్టీస్ ను ముమ్మరం చేశాయి. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ కు ముందు జరుగబోయే ఈ సిరీస్ కు ముందు ఆధిపత్యం సాధించాలని ఇరు జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.

పాసుల కోసం..
గతంలో ఎన్నడూ లేని విధంగా మ్యాచ్ టిక్కెట్ల కోసం విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు కాంప్లిమెంటరీ పాసుల కోసం అటు పోలీసులు.. ఇటు మంత్రులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారులను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకుని రాచకొండ కమిషనరేట్ వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, తర్వాతి స్థాయి సిబ్బంది కలిపి సుమారు 4,000 పాసులు కావాలంటూ హెచ్‌సీఏను డిమాండ్ చేస్తున్నారని ఓ అధికారి మీడియాకు తెలిపారు. పాసుల కోసం కొందరు లేఖలు ఇవ్వగా.. మరికొందరు ఫోన్ ద్వారా హెచ్‌సీఏ పెద్దలకు సమాచారం అందించారు.

భారత్ - ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్ :
- సెప్టెంబర్ 20 : మొదటి టీ20 - మొహాలీ
- సెప్టెంబర్ 23 : రెండో టీ20 - నాగ్‌పూర్
- సెప్టెంబర్ 25 : మూడో టీ20 - హైదరాబాద్
(మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి)


Click it and Unblock the Notifications
