నటరాజన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ఇవ్వాలి.. నాకు కాదు: హార్దిక్

సిడ్నీ: ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (42; 22 బంతుల్లో 3x4, 2x6) మెరుపు బ్యాటింగ్ చేసి టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 22 బంతుల్లో 42 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించిన పాండ్యాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అయితే తనకు బదులు పేసర్ టీ నటరాజన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కాల్సిందని అతడు అభిప్రాయపడ్డాడు.

22 బంతుల్లో 42 పరుగులు
టీమిండియా విజయానికి చివరి రెండు ఓవర్లలో 25 పరుగులు అవసరమైన దశలో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు. 19వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన హార్దిక్ కాస్త ఒత్తిడి తగ్గించాడు. ఇక చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి హార్దిక్ 2 పరుగులు తీశాడు. రెండో బంతిని భారీ సిక్స్‌గా మలిచాడు. ఇక మూడో బంతిని వదిలేసిన హార్దిక్.. నాలుగో బంతికి సిక్స్ బాదాడు. దీంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఉన్నప్పటికీ.. హార్దిక్ పూర్తిగా బాధ్యత తీసుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరహాలోనే హార్దిక్ కూడా చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపించాడు. మొత్తానికి 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు.

4 ఓవర్లలో కేవలం 20 రన్స్
29 ఏళ్ల టీ నటరాజన్ ఆస్ట్రేలియా సిరీస్ ద్వారానే భారత్ తరఫున టీ20ల్లోకి ఆరంగేట్రం చేశాడు. తొలి మ్యాచులో మూడు వికెట్లు తీసిన నటరాజన్.. రెండో టీ20లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లంతా భారీగా పరుగులు ఇచ్చుకోగా.. నట్టూ పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 20 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ బౌలింగ్ చేసిన నటరాజన్.. ఆ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి డార్సీ షార్ట్ వికెట్ తీశాడు. 9వ ఓవర్లో 6 పరుగులు ఇచ్చిన నట్టూ.. 15వ ఓవర్లో 5 రన్స్ ఇచ్చాడు. ఇక 19వ ఓవర్లో 8 పరుగులిచ్చి హెన్రిక్స్ వికెట్ తీశాడు. నట్టూ కారణంగానే ఆసీస్ 15-20 పరుగులు తక్కువగా చేసింది. ఇదే విషయాన్ని హార్దిక్ పాండ్యా అంటున్నాడు.

నటరాజన్ వల్లే
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ... 'ప్రెజెంటేషన్ వేడుకలో నటరాజన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికవ్వాలని నేను అన్నాను. ఇది బ్యాట్స్‌మన్ ఆట అని వారు చెప్పారు. ఆసీస్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న సమయంలో నటరాజన్ మాకు బ్రేక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు చూశాక.. చివరకు 10-15 రన్స్ తక్కువ చేసింది. దీనికి కారణం నటరాజన్. మొదటి ఇన్నింగ్స్ ముగిసాక డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్నప్పుడు అందరికీ నేను ఓ విషయం చెప్పా. మనం 10-15 పరుగులు తక్కువగా ఇచ్చాం. కచ్చితంగా గెలుస్తామన్నా. నటరాజన్ తక్కువగా ఇచ్చిన పరుగులే వల్లే అది సాధ్యం అయింది' అని అన్నాడు.
ఎంఎస్ ధోనీకే సాధ్యం కాలేదు.. టీ20ల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications