Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: హ్యాట్రిక్ సిక్స్‌లతో హార్దిక్ పాండ్యా విధ్వంసం.. ఆసీస్ ముందు కొండంత లక్ష్యం!

 India vs Australia: Hardik Pandya blitz, KL Rahul fifty power IND to 208/6 against AUS in Mohali

మొహాలీ: 'మిషన్ మెల్‌బోర్న్'లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అతనికి అండగా కేఎల్ రాహుల్(35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో టీమిండియా ఆస్ట్రేలియా ముందు 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్ రెండు, జోష్ హజెల్ వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.

రోహిత్, కోహ్లీ విఫలం..

రోహిత్, కోహ్లీ విఫలం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. భారీ సిక్సర్‌తో దూకుడు కనబర్చిన రోహిత్ శర్మ(11) హజెల్ వుడ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(2) తీవ్రంగా నిరాశపరిచాడు. నాథన్ ఎల్లిస్ వేసిన ఐదో ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ధాటిగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం బౌండరీ, సిక్స్ బాదడంతో పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లకు 46 పరుగులు చేసింది.

రాహుల్ హాఫ్ సెంచరీ..

రాహుల్ హాఫ్ సెంచరీ..

కామెరూన్ గ్రీన్ వేసిన ఏడో ఓవర్‌లో ఫోర్, సిక్స్ బాదిన రాహుల్.. మ్యాక్స్‌వెల్ వేసిన మరుసటి ఓవర్‌‌లో ఓవర్ డీప్ మీదుగా సూపర్ సిక్స్ కొట్టాడు. ఇది మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇదే జోరును కొనసాగించిన రాహుల్.. జంపా వేసిన 11వ ఓవర్ చివరి బంతికి క్విక్ సింగిల్ తీసి 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే హజెల్ వుడ్ వేసిన మరుసటి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

సూర్య మెరుపులు..

సూర్య మెరుపులు..

ఇక రాహుల్ ఔటైనా.. సూర్య తన జోరును తగ్గించలేదు. జంపా బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ సిక్స్‌లు బాదాడు. అయితే ఆ వెంటనే గ్రీన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. 4 పరుగుల వ్యవధిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. బ్యాటింగ్‌లో ప్రమోషన్ అందుకున్న అక్షర్ పటేల్(5) నిరాశ పరిచాడు. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌తో కలిసి హార్దిక్ పాండ్యా ధాటిగా ఆడాడు. ప్రతీ ఓవర్‌లో సిక్సర్, బౌండరీ బాది స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. దినేశ్ కార్తీక్‌(6)ను నాథన్ ఎల్లిస్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.

హార్దిక్ మెరుపులు....

హార్దిక్ మెరుపులు....

క్రీజులోకి వచ్చిన హర్షల్ పటేల్ వచ్చి రావడంతో బౌండరీ బాది మరో భారీ షాట్ కొట్టగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్ సూపర్ ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను ఆపి ఔరా అనిపించాడు. 19వ ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించిన హార్దిక్ పాండ్యా 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన హార్దిక్ జట్టుకు 208 పరుగుల భారీ స్కోర్ అందించాడు.

Story first published: Tuesday, September 20, 2022, 21:03 [IST]
Other articles published on Sep 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+