For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రసెల్‌ కన్నా హార్దిక్‌ అత్యుత్తమం.. టీమిండియా ఫినిషర్ పాండ్యానే'

India vs Australia: Harbhajan Singh said Hardik Pandya better than Andre Russell

ముంబై: వెస్టిండీస్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రసెల్‌ కన్నా.. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మెరుగైన ఆటగాడని భారత వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన హార్దిక్.. ఆదివారం జరిగిన రెండో టీ20లో శివాలెత్తాడు. 22 బంతుల్లో 42 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో కోహ్లీసేన మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.

రసెల్‌ కన్నా హార్దిక్‌ అత్యుత్తమం

రసెల్‌ కన్నా హార్దిక్‌ అత్యుత్తమం

తాజాగా ఇండియా టుడేతో హర్భజన్‌ సింగ్‌ మాట్లాడుతూ... 'హార్దిక్‌ పాండ్యాకు ఎప్పటినుంచో నైపుణ్యం ఉంది. అతడు భారీ సిక్సులు కొడతాడనే విషయం మాకు ముందు నుంచే తెలుసు. అయితే ఇప్పుడు నిలకడగా ఆడుతున్నాడు. క్రీజులో నిలదొక్కుకొని మ్యాచ్‌లను పూర్తి చేసే బాధ్యతను తెలుసుకున్నాడు' అని అన్నాడు. పాండ్యా రోజురోజుకూ ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నాడని, టీమిండియాకు అతడే సరైన ఫినిషర్ అని భజ్జీ ఆశాభావం వ్యక్తం చేశాడు. హార్దిక్.. రసెల్ ‌లాంటి ఆటగాడని, విండీస్‌ ఆల్‌రౌండర్‌ కన్నా ఒకింత ఉత్తమ ఆటగాడని తెలిపాడు. అవసరమైన వేళ భారీ సిక్సులు బాదుతూనే.. టెక్నిక్‌తో సింగిల్స్‌ తీయగల సమర్థుడని ప్రశంసించాడు.

ఫినిషర్‌గా చూడటం ఆనందం

ఫినిషర్‌గా చూడటం ఆనందం

'ఎవరిని ఎప్పుడు లక్ష్యంగా చేసుకోవాలో హార్దిక్‌ పాండ్యాకు తెలుసు. ఆ విధంగానే ఫాస్ట్‌ బౌలర్లపై పరుగులు తీస్తూ, స్పిన్నర్లపై బౌండరీలతో దాడి చేయాలనే విషయం కూడా తెలుసు. పాండ్యాను ఇలా ఫినిషర్‌గా చూడటం ఆనందంగా ఉంది' అని హర్భజన్‌ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. చివరి ఓవర్లో రెండు సిక్సులు బాది మ్యాచ్‌ను తనదైన స్టయిల్లో ఫినిష్ చేశాడు. బెస్ట్ ఫినిషర్‌గా తనను తాను మలుచుకుంటున్న పాండ్యా.. గతంలో ఎంఎస్ ధోనీ పోషించిన పాత్రలో తాను ఒదిగిపోవడానికి సిద్ధపడుతున్నాడు. పాండ్యాపై ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ తరహాలోనే హార్దిక్‌ కూడా చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపిస్తున్నాడన్నాడు.

4-5 ఏళ్లపాటు మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తాడు

4-5 ఏళ్లపాటు మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తాడు

హార్దిక్ పాండ్యా అద్భుత బ్యాటింగ్ విషయమై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. వచ్చే 4-5 ఏళ్లపాటు హార్దిక్ తమకు మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తాడని విరాట్ విశ్వాసం వ్యక్తం చేశాడు. 'వచ్చే 4-5 ఏళ్లపాటు అతడు ఆధారపడదగిన మిడిలార్డర్ బ్యాట్స్‌‌మెన్ అవుతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు జట్టును గెలిపించగలడు. ఎవరికైనా హార్దిక్ లాంటి ఫినిషర్ అవసరం. అతడు ఆకలితో ఉన్నాడు. రోజురోజుకూ మెరుగవుతున్నాడు' అని హార్దిక్‌పై ప్రశంసలు కురిపించాడు. పాండ్యాలో సహజ ప్రతిభ ఉందన్న విరాట్.. అనుభవంతో అతడు మరింత రాటుదేలుతున్నాడన్నాడు. ఐపీఎల్ ఆడటం ద్వారా అతడు ప్రావీణ్యం సంపాదిస్తున్నాడన్నాడు.

India vs Australia: కోహ్లీకి తగిన ప్రత్నామ్నాయం అతడే: ఆకాశ్ చోప్రా

Story first published: Monday, December 7, 2020, 14:36 [IST]
Other articles published on Dec 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+