India vs Australia: పెరిగిన కరోనా కేసులు.. తొలి టెస్ట్ డౌటే.. సిరీస్ కూడా అనుమానమే?

సిడ్నీ: భారత్‌తో జరగనున్న సుదీర్ఘ సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించాలని పట్టుదలగా ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు కొత్త సమస్య ఎదురుకానుంది. తొలి టెస్టు మ్యాచ్‌కు వేదికైన అడిలైడ్‌లో సోమవారం కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదు అయ్యాయి. దీంతో అక్కడ మళ్లీ వైరస్ కేసులు పెరుగుతున్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ టెస్ట్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక పరిస్థితులు అనుకూలిస్తేనే.. సిరీస్ కొనసాగొచ్చని అంటున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది.

కరోనా టెన్షన్
డిసెంబర్ 17వ తేదీన అడిలైడ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు జరగాల్సి ఉంది. ఆదివారం వరకు 4 కరోనా కేసులు ఉన్న అడిలైడ్‌లో సోమవారం 17 కేసులు నమోదయ్యాయి. దాంతో ఈ నగరం ఉండే సౌత్ ఆస్ట్రేలియాతో మంగళవారం అర్ధరాత్రి నుంచి తమ సరిహద్దులు మూసివేస్తున్నట్లు పక్క రాష్ట్రాలు వెస్ట్రన్ ఆస్ట్రేలియా, నార్తర్న్ టెరిటరీ, టాస్మేనియా, క్వీన్స్‌లాండ్ ప్రకటించాయి. అక్కడి నుంచి ఎవరైనా వచ్చినా కచ్చితంగా 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లేలా ఆదేశాలు జారీ చేశాయి. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలో సమ్మర్ క్రికెట్ అయోమయంలో పడినట్లు అనుమానాలు వస్తున్నాయి. కానీ అలాంటి డౌట్ అవసరం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.

అడిలైడ్‌లో వద్దనుకుంటే.. ఎంసీజీ సిద్ధం
అడిలైడ్ టెస్ట్‌కు ఎటువంటి ప్రమాదం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా చెబుతున్నా.. ఆ మ్యాచ్‌పై దక్షిణ ఆస్ట్రేలియా మంత్రి స్టీవెన్ మార్షల్ గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. ఒకవేళ టెస్ట్ వేదికను మార్చాలనుకుంటే.. తొలి టెస్ట్‌ను మెల్‌బోర్న్‌లో నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ ఎంసీజీలోనే జరగనున్నది. ఒకవేళ అడిలైడ్‌లో వద్దనుకుంటే.. ఎంసీజీ సిద్ధంగా ఉంటుందన్నారు. టెస్టు మ్యాచ్‌ను యధావిధిగా కొనసాగించాల్సి వస్తే.. న్యూ సౌత్ వేల్స్ నుంచి అడిలైడ్‌కు మాస్ ఎయిర్ లిఫ్ట్ చేయాలని భావిస్తోంది. న్యూ సౌత్ వేల్స్ నుంచి సౌత్ ఆస్ట్రేలియా ప్రధాన నగరం అడిలైడ్‌కు ఎయిర్ లిఫ్ట్ చేయడం.. మ్యాచ్ ముగిసిన వెంటనే మళ్లీ వాయు మార్గంలోనే వారిని న్యూ సౌత్ వేల్స్‌కు తరలించడం ముందున్న మరో మార్గం.

ప్రత్యేక విమానాల ద్వారా
తొలి టెస్టుకు స్టేడియంలో సగం మంది ప్రేక్షకులను అనుమతించాలని సీఏ ఇప్పటికే నిర్ణయించింది. అయితే పరిస్థితి మారకపోతే మాత్రం ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరగవచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక విమానాల ద్వారా ఆస్ట్రేలియా జాతీయ జట్టు, దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చాలని సీఏ భావిస్తోంది. కరోనా సమస్య లేని సిడ్నీకి అందరినీ తీసుకెళితే అన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు అవకాశం ఉంటుందనేది సీఏ ఆలోచన. ప్రస్తుతం భారత జట్టు సిడ్నీలోనే ఉంది.

టెస్ట్ సిరీస్ అనుమానమే
అనూహ్య పరిణామాల నేపథ్యంలో అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఇక ఎయిర్ లిఫ్ట్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అంగీకరించాల్సి ఉంది. బీసీసీఐ అంగీకరించకపోతే టెస్ట్ సిరీస్‌ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే, టీ20 మ్యాచ్‌లు సిడ్నీ, క్యాన్‌బెర్రాలో నిర్వహించేలా సీఏ ఇదివరకే షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ రెండు చోట్ల పెద్దగా ఇబ్బందికర పరిణామాలు లేవు. దీంతో పరిమిత ఓవర్ల ఫార్మట్లలో మ్యాచ్‌లను ముగించుకుని ఇంటిదారి పట్టొచ్చనే ఊహాగాలను కూడా వస్తున్నాయి.
India vs Australia: ఈసారి పుజారాకు అంత వీజీ కాదు.. ఆ చాలెంజ్ తప్పదు: మెక్‌గ్రాత్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications