సిడ్నీ టెస్ట్ ముందు రహానేకు వసీం జాఫర్ కోడింగ్ మెసేజ్.. టీమ్ సెలెక్షన్‌పై కీలక అడ్వైజ్!

ముంబై: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా.. మెల్‌బోర్న్ టెస్ట్‌లో అద్భుత విజయాన్నందుకొని ఆ ఘోరపరాజయానికి బదులు తీర్చుకుంది. సిరీస్‌ను 1-1తో సమం చేసి రేసులో నిలిచింది. దాంతో సిడ్నీ వేదికగా జరగనున్న మూడో టెస్ట్ ఇరు జట్లకు కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్ బరిలోకి దిగే టీమిండియా తుది జట్టుపై తీవ్ర చర్చ జరుగుతుంది. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ అందుబాటులోకి రావడం.. ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ దారుణంగా విఫలమవడం, గాయంతో ఉమేశ్ యాదవ్ దూరమవడంతో జట్టులో మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. దాంతో మాజీ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు జట్టు కూర్పు విషయంలో తాత్కలిక సారథి అజింక్యా రహానేకు పలు సూచనలు చేస్తున్నారు.

కోడింగ్ మేసేజ్‌తో అడ్వైజ్..
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా రహానేకు కీలక సలహా ఇచ్చాడు. అయితే ఈ సలహాను వసీం జాఫర్ ట్విటర్ వేదికగా మరోసారి తనదైన శైలిలో చెప్పడం చర్చనీయాంశమైంది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గురించి కోడింగ్ మెసేజ్ రూపంలో సలహా ఇచ్చిన వసీం జాఫర్.. దాన్ని డీకోడ్ చేయాలని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మరో సెహ్వాగ్‌ను తలపిస్తున్న వసీం జాఫర్ తనదైన పోస్ట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. రెండో టెస్ట్‌కు ముందుకు కూడా శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌ను తీసుకోవాలని ఇదే తరహా కోడింగ్ మేసేజ్‌తో ట్వీట్ చేసిన జాఫర్.. మరోసారి అదే శైలిలో సలహా ఇచ్చాడు.
ఆ ట్వీట్ ఏంటంటే..
‘ఈ రోజు సరస్సు దగ్గర ఓ మంచి ఫీల్టర్ కాఫీ తాగాను. అక్కడ నీళ్లలోని చేపను చూసిన నాకు అది శ్వాస ఎలా పీల్చుకుంటుందో అనేది అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత నేను బొవివాలిలో రెస్టారెంట్ ఉన్న డొంబివాలి నుంచి పాత పాల్ లోకి వచ్చే ముందు చే గువేరా చిత్రాన్ని దాటి నడిచాను. సిడ్నీ టెస్ట్‌కు గుడ్ లక్. డీకోడ్ చేయండి'అని వసీం జాఫర్ ట్వీట్ చేశాడు. సాధారణ అభిమానులకు ఈ కోడింగ్ ట్వీట్ ఏమాత్రం అర్థం కాదు. కానీ క్రికెట్ అప్‌డేట్స్ రెగ్యూలర్‌గా ఫాలో అయ్యేవారు మాత్రం ఇట్టే కనిపెట్టేస్తారు. క్రికెట్ వీరాభిమానులు కూడా అదే పని చేశారు.

ఆ కోడింగ్ అర్థం ఏంటంటే..?
వసీం ట్వీట్‌లో మంచి ఫీల్డర్ కాఫీ తాగనన్నాడు. కాఫీ అంటే కేఎల్ రాహుల్. కాఫీ విత్ కరణ్ షోతో ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్ ఎదుర్కొన్న వివాదాన్ని వసీం ఇక్కడ పరోక్షప్రస్తావించాడు. అతన్ని సిడ్నీ టెస్ట్‌లో ఓపెనర్‌గా తీసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత వ్యాక్యంలో ‘నీళ్లలో చేప ఎలా గాలి పిల్చుకుంటుదో.. నిజంగా అద్భతం అన్నాడు.' వాస్తవానికి చేపలకు మెదడు ఉండదు. వాటి మెప్పలు(గిల్స్) ద్వారానే అవి శ్వాస తీసుకుంటాయి. ఈ లైన్‌తో శుభ్‌మన్ గిల్‌ను మరోసారి ఓపెనర్‌గా ఆడించాలని పేర్కొన్నాడు.

పుజారా, రోహిత్, రహానే..
అనంతరం చేగువిరా చిత్రం అంటూ చతేశ్వర్ పుజరా నిక్ నేమ్‌ను ప్రస్తావించాడు. దానిర్థం పుజారాను మూడో స్థానంలో కొనసాగించాలని సలహా ఇచ్చాడు. రోహిత్ శర్మను ఉద్దేశించి బోరివలీలో రెస్టారెంట్ అంటూ ప్రస్తావించాడు. గాయం నుంచి కోలుకున్న రోహిత్ టెస్ట్ వైస్ కెప్టెన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. పైగా బోరివలీ రోహిత్ జన్మస్థలం అంతేకాకుండా రెస్టారెంట్ అంటూ ఇటీవల అతను చిక్కుకున్న వివాదాన్ని ప్రస్తావించాడు. తద్వారా రోహిత్‌ను ఐదో స్థానంలో ఆడించాలని పేర్కొన్నాడు. ఇక దోంబివాలి అంటూ అజింక్యా రహానే జన్మస్థలాన్ని ప్రస్తావించాడు. దాంతో రహానే నాలుగో స్థానంలో బ్యాటింగ్ ఆడాలన్నాడు.
జాఫర్ ఇచ్చిన సలహా ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘రాహుల్, శుభ్‌మన్ ఓపెనర్లుగా ఆడించాలి. పుజారా, రహానే, రోహిత్ మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో బ్యాటింగ్ చేయాలి.' మెదడుకు పరీక్షగా నిలిచిన ఈ ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications