ఆస్ట్రేలియాకు గట్టి షాక్.. టీ20 సిరీస్ నుంచి స్టార్ ఓపెనర్ ఔట్!

సిడ్నీ: భారత్‌తో వరుస విజయాలందుకొని వన్డే సిరీస్ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. రెండు వన్డేల్లోనూ కోహ్లీసేనపై అర్ధశతకాలు సాధించిన ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మిగిలిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆదివారం రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ అతను గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల్లో నొప్పితో మైదానంలోనే విలవిల్లాడడంతో వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా జట్టు వైద్య బృందం వార్నర్‌ను బయటకు తీసుకెళ్లింది. అనంతరం వైద్య పరీక్షలు చేయగా గజ్జలో తీవ్రగాయమైనట్లు తేలింది.

టీ20 సిరీస్ నుంచి ఔట్
గాయం తీవ్రత కారణంగా వార్నర్ నామమాత్రపు మూడో వన్డేతో పాటు తర్వాత ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్‌కు అందుబాటులో ఉండడని కోచ్ జస్టిన్ లాంగర్ స్పష్టం చేశాడు.
వార్నర్ స్థానాన్ని జాన్ మాథ్యూ షార్ట్ భర్తీ చేస్తాడని తెలిపాడు. అలాగే తమ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్ గెలుపొందడంతో.. టెస్టు సిరీస్‌కు ముందు ప్రధాన పేసర్ పాట్ కమిన్స్‌కు కూడా విశ్రాంతి ఇవ్వాలనుకున్నట్లు ఆసీస్ కోచ్ తెలిపాడు. అతని స్థానంలో డీఆర్సీ షార్ట్‌ను టీ20 జట్టులోకి తీసుకున్నారు.
వార్నర్, కమిన్స్ తమకు కీలక ఆటగాళ్లని, రాబోయే టెస్టు సిరీస్‌లో వాళ్లు రాణించాలంటే తగినంత విశ్రాంతి అవసరమని చెప్పాడు. డిసెంబర్ 17 నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్ తమకెంతో ముఖ్యమని అన్నాడు. ఆ సిరీస్‌లో సత్తా చాటాలని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు.

టెస్ట్ సిరీస్‌కు డౌటే..
ఇక డేవిడ్ వార్నర్‌కు గజ్జ గాయం( గ్రోయిన్ స్ట్రెయిన్) నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని కామెంటేటర్ గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. కనీసం 6 వారాల సమయం పడుతుందన్నాడు. దాంతో వార్నర్ టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆసీస్ ముందు జాగ్రత్తగా వార్నర్‌ను టీ20 సిరీస్ నుంచి తప్పించింది. టెస్ట్ సిరీస్ వరకు పూర్తిగా కోలుకోవాలనుకుంటుంది. డిసెంబర్ 17 నుంచి ఫస్ట్ టెస్ట్ మొదలు కానుంది. అయితే వార్నర్ గైర్హాజరీలో లబుషేన్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది.

ఆసీస్‌కు కష్టమే..
వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగా.. మూడు టీ20ల సిరీస్, నాలుగు టెస్టుల సిరీస్‌కు కొద్ది రోజుల ముందు వార్నర్ గాయపడటం ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బగానే భావించొచ్చు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన వార్నర్.. రెండో వన్డేలో 83 పరుగులు చేశాడు. ఫించ్‌తో కలిసి రెండు మ్యాచ్‌ల్లోనూ తొలి వికెట్‌కు వరుసగా 156, 142 చొప్పున భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వన్డే, టీ20ల్లో ప్రత్యామ్నయ ఓపెనర్లు ఉన్నా టెస్ట్‌ల్లో లేరు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో మరో ఆటగాడిని జట్టుతో చేర్చడం ఆసీస్‌కు తలనొప్పి వ్యవహారం. టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ ఆధిపత్యం చెలాయించాలంటే వార్నర్ ఉండాల్సిందే. ఇదిలా ఉండగా, భారత్ తొలి రెండు వన్డేల్లో విఫలమవగా మంగళవారం మూడో వన్డేలో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాదించి వన్డే సిరీస్‌కు ముగింపు పలకాలని చూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications