న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పోటీ అనేది బంతికి.. బ్యాట్‌కి మాత్రమే: గంభీర్

 Warrant issued against Gautam Gambhir by Delhi court in real estate fraud case

ముంబై: ఆడుతున్న టోర్నీ, సందర్భం గురించి ఆలోచించకుండా ఒత్తిడిని ఎదుర్కోవడం, గడ్డు పరిస్థితులను అధిగమించడమే ఆటగాడికి అత్యంత కీలకమని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్‌ అన్నాడు. ఈ మధ్యనే గౌతీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీమిండియా ప్రపంచకప్‌లు గెలిచిన రెండు జట్లలో భాగమవ్వడం తన చిన్ననాటి కలగా పేర్కొన్నాడు. ఆ రెండు ‌ ఫైనల్స్‌లో గంభీరే టాప్‌ స్కోరర్‌. ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు ఎలా సన్నద్ధమయ్యేవారు అని అడిగిన ప్రశ్నకు గంభీర్‌ జవాబిచ్చాడు.

ప్రపంచ కప్ జట్టులో ఆడాలని కల

ప్రపంచ కప్ జట్టులో ఆడాలని కల

‘టోర్నీగానీ, సందర్భం గానీ మనపై ఆధిపత్యం చెలాయించేలా ఉండొద్దు. అది ప్రపంచకప్‌ ఫైనల్ అయినా, ఇంకో మ్యాచ్ అయినా పోటీ జరిగేది బంతికి, బ్యాటుకు మధ్యే. దీనిని అంగీకరించడం అంత సులభం కాదు. ఒక ఆటగాడిగా నేనిలాగే సన్నద్ధమయ్యా. అది ప్రపంచకప్‌ తొలి మ్యాచ్ అయినా, తుది మ్యాచ్ అయినా పోటీ బౌలర్‌, బ్యాట్స్‌మెన్‌కు మధ్యే జరుగుతుంది. తర్వాత బంతిని ఎలా ఆడాలన్నదే ముఖ్యం. రెండు ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు ముందు నేనిలాగే ఆలోచించా. ప్రపంచ విజేతగా నిలిచిన జట్టులో ఉండటం నా చిన్ననాటి కల. అలా ఒక్కసారి కాదు రెండు సార్లు అవకాశం లభించడం నా అదృష్టం' అని గంభీర్‌ అన్నాడు.

మోసపూరితంగా వ్యవహరించారని

మోసపూరితంగా వ్యవహరించారని

ఇటీవల గౌతం గంభీర్ ఓ కొత్త వివాదంలో చిక్కుకుని బయటపడ్డాడు. తాను అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న రుద్ర బిల్డ్‌వెల్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై కస్టమర్లంతా ఎదురుతిరుగుతుండటంతో సాకేత్ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసు విచారణలో శిక్ష అనుభవిస్తున్న కంపెనీ డైరక్టర్ ముకేష్ ఖురానా, హెచ్‌ఆర్ ఇన్ ఫ్రా సిటీ డైరక్టర్ గౌతం మెహతాలు మోసపూరితంగా వ్యవహరించారని, పెట్టుబడిదారుల నుంచి ఇళ్లు కొనిస్తామంటూ డబ్బు తీసుకుని మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

సంబంధం లేదంటూ గంభీర్ వాదన

సంబంధం లేదంటూ గంభీర్ వాదన

సదరు రుద్ర గ్రూపుకు గౌతం గంభీర్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంతో ఆయనకు కూడా చిక్కులు తప్పలేదు. ఈ క్రమంలో ఇందిరాపురం ప్రాజెక్టుకు తనకు ఏం సంబంధం లేదని కేవలం అంబాసిడర్‌గా మాత్రమే వ్యవహరిస్తున్నానంటూ గంభీర్ వాదన వినిపించాడు. దీంతో గంభీర్ ఛార్జి షీటు దాఖలు నుంచి తప్పించుకున్నాడు. ఈ మాజీ క్రికెటర్‌ను మినహాయించి మిగిలిన వారిపై ఆరోపణల గుప్పించడంతో కేసు విచారణ జరగాల్సి ఉంది.

Story first published: Thursday, December 20, 2018, 13:29 [IST]
Other articles published on Dec 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X