అతి నిదానంగా పూజారా సెంచరీ, బాక్సింగ్ టెస్టులో ఐదో వాడిగా...

మెల్‌బౌర్న్: ఆస్ట్రేలియా గడ్డపై క్రీజులో నిదానంగా పరుగులు జోడిస్తూ.. సెంచరీ పూర్తి చేసుకున్న పూజారా రికార్డులు బద్దలు కొట్టాడు. బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా రికార్డులు నెలకొల్పిన వారి జాబితాలో చేరిపోయాడు. ఓపెనర్ హనుమ విహారీ విఫలమైన తర్వాత క్రీజులోకి వచ్చిన పూజారా వికెట్‌ను కాపాడుకునేందుకు చాలానే కష్టపడ్డాడు. మయాంక్ పరుగుల వేగానికి సహకారాన్ని అందించాడు. ఆ తర్వాత మయాంక్ అవుట్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీతో పాటు నిదానంగా పరుగులు జోడించాడు.

68తో బ్యాటింగ్‌ని కొనసాగించిన పుజారా
నిదానంగా ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బ్యాట్స్‌మన్ పూజారా సెంచరీతో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ఆటలో రెండో రోజైన గురువారం ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 68తో బ్యాటింగ్‌ని కొనసాగించిన పుజారా 280 బంతులు ఆడి 10 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇన్నింగ్స్ 114వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి మరీ.. మిడాఫ్ దిశగా బౌండరీ బాదిన పుజారా.. కెరీర్‌లో 17వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకోగలిగాడు.
కోహ్లీ ముంగిట తలవాల్చిన ద్రవిడ్ రికార్డు (వీడియో)

సచిన్, సెహ్వాగ్, కోహ్లీ, రహానె.. ల సరసన పూజారా
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా పుజారా సరికొత్త రికార్డుల్లో నిలిచి దిగ్గజాల సరసన చేరాడు. ఇప్పటి వరకు మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సచిన్ టెండూల్కర్ (1999), వీరేంద్ర సెహ్వాగ్ (2003), విరాట్ కోహ్లి (2014), అజింక్య రహానె (2014) మాత్రమే సెంచరీలు సాధించారు. తాజాగా ఈ జాబితాలోకి పుజారా కూడా చేరాడు.

పేలవంగా పేలిన రికార్డు
పుజారా కెరీర్‌లో ఇదే అత్యంత నిదానమైన సెంచరీ. ఇంగ్లాండ్‌తో 2012లో 248 బంతుల్లో సెంచరీ మార్క్‌ని అందుకున్న పుజారా.. తాజాగా ఆ రికార్డుని మరింత పేలవంగా సవరించాడు. ఇక భారత్ తరఫున అత్యంత నెమ్మది సెంచరీ రికార్డుల్లో రవిశాస్త్రి 307 బంతులతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ 286 బంతులతో పుజారా కంటే ముందు వరుసలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications