
350 పరుగులు చేస్తాం..
‘విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే వికెట్లను వెంటవెంటనే కోల్పోయినప్పటికీ మేమింకా మంచి స్థితిలోనే ఉన్నాం. ఎందుకంటే మేం ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయాం. క్రీజులో ఉన్న అశ్విన్, సాహా బ్యాటింగ్ చేయగలరు. వాళ్లు పోరాడితే ఈజీగా 275-300 వరకు స్కోర్ చేస్తాం. బౌలర్లు కూడా చేయి వేస్తే 350 స్కోర్ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి ఓ దశలో మ్యాచ్ మా చేతిలో ఉంది. విరాట్, రహానే ఔటవ్వడంతో ఆసీస్ మ్యాచ్‌లోకి వచ్చింది. వారు క్రీజులో ఉన్నప్పుడు 188/3తో పటిష్టంగా ఉంది. దానికోసమే ఆరంభంలోనే మేం నెమ్మదిగా ఆడాం.

తక్కువ పరుగులు చేసినా..
తొలి రెండు సెషన్లలో తక్కువ రన్స్ చేసినప్పటికీ అప్పుడు మాదే పై చేయి. ఎందుకంటే బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు వికెట్లు కోల్పోకూడదని ముందుగానే అనుకున్నాం. ఆ స్ట్రాటజీ ప్రకారమే ఇన్నింగ్స్ నిర్మించాం కాబట్టి నేను నా బ్యాటింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నా. టెస్ట్ క్రికెట్‌లో రెండు వికెట్లు వరుసగా కోల్పోతే ప్రత్యర్థికి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఆచూతూచి ఆడాలి. ఈ ఫార్మాట్‌ను గౌరవించాలి. లూజ్ బంతులనే బౌండరీ తరలించాలి. మంచి బంతులను గౌరవించాలనే ప్రణాళికతోనే బ్యాటింగ్ చేశాం. దాంతోనే నేను విరాట్, విరాట్-రహానే కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాం'అని పుజారా చెప్పుకొచ్చాడు.

148 బంతులకు తొలి బౌండరీ
పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ పృథ్వీ షా వికెట్ కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన పుజారా పూర్తిగా డిఫెన్స్ చేశాడు. ప్రతీ బంతిని ఆపడానికే ప్రయత్నించాడు. డిన్నర్ తర్వాత ఎక్కువ సేపు స్పిన్నర్ నాథన్ లయన్, పుజారా మధ్య సమరంలా సాగింది. ఫస్ట్ బౌండరీ కొట్టడానికి పుజారా 148 బంతులు ఆడాడంటే.. అతను ఎంత నెమ్మదిగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు లైయన్ బౌలింగ్‌లో ఒకటి, రెండు సార్లు బౌండ్రీలు కొట్టే సాహసం చేసినా.. క్లాసిక్ ఆఫ్ బ్రేక్ బాల్స్ ముందు తలొగ్గాడు.

భారత్ 233/6
ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి బాధ్యతాయుత బ్యాటింగ్, చతేశ్వర్ పుజారా అడ్డుగోడ, అజింక్యా రహానే నిలకడ వెరసి టీమిండియా మొదటి రోజు ఆటను మెరుగైన స్థితిలో ముగించింది. గురువారం టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లి (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టార్క్ 2 వికెట్లు తీయగా... హాజల్‌వుడ్, కమిన్స్, లయన్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. వృద్ధిమాన్ సాహా (9 బ్యాటింగ్), అశ్విన్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.


Click it and Unblock the Notifications
