Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ గడ్డపై భంగపడిన చోటే సత్తా చాటిన పూజారా

India vs Australia: Cheteshwar Pujara answered with ‘masterclass’ knock in Sydney

సిడ్నీ: ఆసీస్ గడ్డపై గత పర్యటనలో పరాభవానికి గురైన చోటే పూజారా తిరిగి సత్తా చాటాడు. నాడు నెమ్మెదిగా ఆడాడంటూ వేటుకు గురైన పూజారానే టీమిండియాను ఆదుకున్నాడు. ఇలా భంగపడిన చోటే భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో గుర్తుండిపోయే సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (193: 373 బంతుల్లో 22ఫోర్లు) భారీ సెంచరీ బాదడంతో.. ఓవర్‌నైట్ స్కోరు 303/4తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు 622/7 భారీ స్కోరుతో డిక్లేర్ ప్రకటించింది.

నెమ్మదిగా ఆడుతున్నాడనే కారణం చూపుతూ

నెమ్మదిగా ఆడుతున్నాడనే కారణం చూపుతూ

నాలుగేళ్ల క్రితం ఇలానే సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో నెమ్మదిగా ఆడుతున్నాడనే కారణం చూపుతూ పూజారాను టీమిండియా మేనేజ్‌మెంట్ వేటుకు గురిచేసింది. అప్పట్లో నాలుగో టెస్టుకి ముందు జరిగిన 3 టెస్టుల్లోనూ 33.2 సగటుతో పుజారా 201 పరుగులే చేశాడు. దీంతో.. అతడ్ని ఆఖరి టెస్టుకి పక్కన పెట్టింది. కానీ.. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచాడు.

కాస్తలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నా..

కాస్తలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నా..

ఇప్పటికే అడిలైడ్, మెల్‌బౌ‌ర్న్ టెస్టుల్లో సెంచరీలు సాధించి భారత విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన పుజారా.. సిడ్నీలోనూ అదే తరహా ప్రదర్శన చూపించాడు. గురువారం తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో విరాట్ కోహ్లీ (23), అజింక్య రహానె (18), లోకేశ్ రాహుల్ (9) పేలవంగా విఫలమైయ్యారు. ఈ నేపథ్యంలో అనితర సాధ్యమైన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు పూజారా. అయితే.. కాస్తలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నా.. అతని కెరీర్‌లో మాత్రం ఇదో బెస్ట్ ఇన్నింగ్స్‌‌గా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

క్రమంగా దూకుడు పెంచిన పూజారా

క్రమంగా దూకుడు పెంచిన పూజారా

గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే కేఎల్ రాహుల్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా.. గురువారం 3 సెషన్లు, శుక్రవారం ఒకటిన్నర సెషన్ సహనంతో బ్యాటింగ్ చేశాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. తొలి 59 బంతుల్లో చేసిన పరుగులు 16 మాత్రమే. అయితే.. అప్పటికే నిలదొక్కుకున్న పూజారా క్రమంగా దూకుడు పెంచాడు.

ద్రవిడ్‌ను దాటి దశాబ్దాల నాటి రికార్డు బద్దలుకొట్టిన పూజారా

3 డబుల్ సెంచరీలు, 18 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు

3 డబుల్ సెంచరీలు, 18 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు

ఈ క్రమంలోనే 134 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న పుజారా.. మరో 65 బంతుల్లో సెంచరీని, 282 బంతుల్లో 150 పరుగుల మైలురాయిని అందుకుని డబుల్ సెంచరీకి చేరువైయ్యాడు. కానీ.. వ్యక్తిగత స్కోరు 193 వద్ద స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి భారీ షాట్ ఆడబోయి అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పుజారా టెస్టు కెరీర్‌లో ఇప్పటికే 3 డబుల్ సెంచరీలు, 18 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

1
43626
Story first published: Friday, January 4, 2019, 12:34 [IST]
Other articles published on Jan 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+