
ఓపెనర్‌గా పృథ్వీ షా
డే/నైట్ టెస్టులో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలకి టీమిండియా మేనేజ్‌మెంట్ చోటిచ్చింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ షా, శుభమన్ గిల్ అంచనాల్ని అందుకోలేకపోయారు. అయితే షా కంటే గిల్ కాస్త పర్వాలేదనిపించాడు. హాఫ్ సెంచరీ బాది రేసులో ముందున్నాడు. అందరూ కూడా అగర్వాల్‌కి జతగా గిల్ ఆడుతాడని భావించారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం షాకు ఓటేసింది. దీంతో గిల్ ఆశలు ఆవిరయ్యాయి. దూకుడుగా ఆడే షా.. ఆసీస్ పిచ్‌లపై ఎలా ఆడుతాడో చూడాలి. అగర్వాల్‌కి షా మంచి సపోర్ట్ ఇస్తే టీమిండియాకు మంచి ఆరంభం దక్కుతుంది.

కీపర్‌గా సాహా
మూడో స్థానంలో టెస్ట్ స్పెసలిస్ట్ చతేశ్వర్ పుజారా రానున్నాడు. ఆ తర్వాత వైస్ కెప్టెన్ అజింక్య రహానె, కెప్టెన్ విరాట్ కోహ్లీలు రానున్నారు. యువకుడు రిషబ్ పంత్‌ని పక్కన పెట్టి సీనియర్ అయిన వృద్ధిమాన్ సాహాకి కీపర్‌గా అవకాశమిచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్. మిడిలార్డర్‌లో తెలుగు క్రికెటర్ హనుమ విహారి చోటు దక్కించున్నాడు. స్పిన్నర్ కోటాలో రవీంద్ర జడేజాకి బదులుగా అశ్విన్‌కి అవకాశం ఇచ్చింది. విహారి పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి పంత్, జడేజాలకు టీమిండియా మేనేజ్‌మెంట్ షాక్ ఇచ్చింది. ఇక కేఎల్ రాహుల్‌కు కూడా షాక్ తగిలింది.
ముగ్గురు పేసర్లు
ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాలను ఎంచుకుంది టీమిండియా మేనేజ్‌మెంట్. గాయం కారణంగా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ సిరీస్‌కి దూరమయిన విషయం తెలిసిందే. మొత్తానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకెంతో ఇష్టమైన ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లు, నలుగురు బౌలర్ల కాంబినేషన్‌తోనే తొలి టెస్టులో బరిలోకి దిగుతున్నాడు. భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది. డే/ నైట్ టెస్టు రూపంలో గులాబి బంతితో ఈ మ్యాచ్ జరగనుంది.

భారత్ జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా.
రిజర్వ్ బెంచ్: శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా.


Click it and Unblock the Notifications

రూల్స్ బ్రేక్ చేసి.. వివాదంలో చిక్కుకున్న ఆసీస్ ఓపెనర్!!










