For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రూల్స్‌ బ్రేక్ చేసి.. వివాదంలో చిక్కుకున్న ఆసీస్ ఓపెనర్!!

Chris Lynn breach Coronavirus protocols in BBL 10

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ క్రిస్ ‌లిన్ బయో బబుల్ రూల్స్‌ బ్రేక్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు. కంగారూల గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున ఆడుతున్న లిన్.. తాజాగా బబుల్‌ వెలుపలికి వెళ్లాడు. ట్యాక్సీలో ప్రయాణించడం ద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిబంధనల్ని అతడు అతిక్రమించాడు. లిన్‌తో పాటు డేనియల్ లారెన్స్ కూడా కరోనా రూల్స్‌ బ్రేక్ చేశాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు లిన్, లారెన్స్ ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్ జట్టుకి భారీగా జరిమానా విధించింది.

రూల్స్‌ బ్రేక్ చేసిన లిన్

రూల్స్‌ బ్రేక్ చేసిన లిన్

డిసెంబరు 10 నుంచి బిగ్‌బాష్ లీగ్ 10వ సీజన్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. బ్రిస్బేన్ హీట్ గత సోమవారం సిడ్నీ థండర్స్‌తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ ఓపెనర్ క్రిస్ ‌లిన్ (69; 44 బంతుల్లో 3x4, 5x6) హాఫ్ సెంచరీ చేయడంతో బ్రిస్బేన్ 178 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ సిడ్నీ థండర్స్ ఆ లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత బయో బబుల్ నిబంధనల్ని క్రిస్ ‌లిన్ అతిక్రమించాడు. హోటల్ వెలుపలికి వెళ్లి ట్యాక్సీలో ప్రయాణించాడు. ఆపై ట్యాక్సీ డ్రైవర్‌‌తో క్లోజ్‌గా ఉంటూ ఓ ఫొటో కూడా దిగాడు.

ట్యాక్సీ డ్రైవర్‌తో ఫొటో

ట్యాక్సీ డ్రైవర్‌తో ఫొటో

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బిగ్‌బాష్ లీగ్‌ని బయో బబుల్ వాతావరణంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నో జాగ్రత్తల మధ్య టోర్నీని సజావుగా సాగేలా క్రికెట్ ఆస్ట్రేలియా చూస్తోంది. ఆటగాళ్ల రక్షణే మొదటి కర్తవ్యంగా పనిచేస్తోంది. సీఏ రూల్స్ ప్రకారం ఒక్కసారి ఆటగాడు బయో బబుల్‌లోకి వెళ్లిన తర్వాత.. వెలుపలి వ్యక్తుల్ని కలవడానికి వీల్లేదు. తాజాగా ఈ రూల్‌ని బ్రేక్ చేసిన క్రిస్ ‌లిన్.. ట్యాక్సీ డ్రైవర్‌తో ఫొటో దిగడం, ట్యాక్సీలో ప్రయాణించడం ద్వారా నిబంధల్ని అతిక్రమించినట్లు తేలింది. దీంతో అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంది.

తాత్కాలికంగా సస్పెండ్

తాత్కాలికంగా సస్పెండ్

రూల్‌ని బ్రేక్ చేసిన క్రిస్ ‌లిన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్‌బాష్ టోర్నీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అతడిని ప్రత్యేక గదిలో ఉంచి.. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో జట్టు డగౌట్‌లోకి వచ్చేందుకు కూడా లిన్‌కు అనుమతి లేదు. అంతేకాదు హోటల్‌లోని తన సహచరులతోనూ సామాజిక దూరం పాటించాలని ఆదేశించింది. అయితే తాను చేసిన తప్పిదానికి ‌లిన్ క్షమాపణలు చెప్పాడు. రూల్‌ని బ్రేక్ చేసిన ‌లిన్‌.. రెండు సార్లు వైరస్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగటివ్ వస్తేనే జట్టుతో కలిసే అవకాశాలు ఉన్నాయి.

చోటు దక్కలేదు

చోటు దక్కలేదు

క్రిస్ ‌లిన్‌కు ఆసీస్ గడ్డపై జరుగుతున్న సుదీర్ఘ భారత పర్యటనలో చోటు దక్కలేదు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్‌ ముగియగా.. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. గురువారం డే/నైట్ టెస్ట్ ప్రారంభం కానుంది. విదేశాల్లో టీమిండియా ఆడ‌బోతున్న తొలి పింక్ బాల్ టెస్ట్ ఇదే కావ‌డం కూడా ఈ మ్యాచ్‌కు మరింతప్రాధాన్య‌త సంతరించుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం బంగ్లాదేశ్‌తోనే అది కూడా సొంత‌గ‌డ్డ‌పై టీమిండియా డే/నైట్ టెస్ట్ ఆడింది.

ప్రపంచకప్ కంటే.. అదే నా జీవితంలో గొప్ప విషయం: కపిల్ ‌దేవ్

Story first published: Wednesday, December 16, 2020, 14:32 [IST]
Other articles published on Dec 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+