India vs Australia: భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఖేల్ ఖతమ్.. ఆసీస్‌కు భారీ ఆధిక్యం!

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 244 పరుగులకు ముగిసింది. ప్యాట్ కమిన్స్(4/29) ధాటికి భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మూడో రోజు ఆటలో చతేశ్వర్ పుజారా(50) మినహా ఇతర బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. దాంతో ఆస్ట్రేలియాకు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 94 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు వికెట్లకు తోడుగా.. జోష్ హజెల్ వుడ్ రెండు, మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీశారు. ఇక ముగ్గురు బ్యాట్స్‌మెన్ రనౌట్ కావడం విశేషం.

విఫలమైన రహానే, విహారీ..
96/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆదిలోనే కెప్టెన్ అజింక్యా రహానే(22), హనుమ విహారీ(4) వికెట్లను చేజార్చుకుంది. కమిన్స్ బౌలింగ్‌లో రహానే క్లీన్ బౌల్డ్ కాగా.. హనుమ విహారీ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(36)తో నయావాల్ చతేశ్వర్ పుజారా(50)ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడుతూ ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. మరోవైపు పంత్ కూడా తన శైలికి భిన్నంగా ఓపికగా ఆడటంతో భారత్ 180/4 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

దెబ్బతీసిన గాయం..
పుజారా-పంత్ నిదానంగా ఆడుతుండటంతో భారత్ ఇన్నింగ్స్ మెరుగ్గానే అనిపించింది. కానీ కమిన్స్ బౌలింగ్‌లో ఓ బంతి రిషభ్ పంత్ లెఫ్ట్ ఎల్బోకు బలంగా తాకింది. దాంతో అతను నొప్పితో విలవిలలాడాడు. టీమిండియా ఫిజియో పరీక్షించి ప్రథమ చికిత్స చేయడంతో పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ మునపటిలా ఆడలేకపోయాడు. ఈ గాయం భారత బ్యాటింగ్‌ను దెబ్బతీసింది. నొప్పితో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ పంత్.. హజెల్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ వికెట్ ముందు బంతికే పుజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

49 రన్స్ 5 వికెట్లు..
హాఫ్ సెంచరీ పూర్తయిన మరుసటి ఓవర్‌లోనే కమిన్స్ బౌలింగ్‌లో పుజారా కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో భారత పతనం మొదలైంది. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ అలానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. రవిచంద్రన్ అశ్విన్(10) రనౌట్ కాగా.. నవ్‌దీప్ సైనీ(3) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత బుమ్రా(0) రనౌటయ్యాడు. ఇక సిరాజ్(6)తో జడేజా(28) కొంత పోరాడినప్పటికీ కమిన్స్ దెబ్బతీశాడు. సిరాజ్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి భారత్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications