న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలీసా.. నీ భర్త స్టార్క్ కన్నా సిరాజ్ ఎంతో నయం!

India vs Australia: Alyssa Healy as a fan mocks Mitchell Starc after Mohammed Siraj picks more wickets than him
Ind vs Aus 4th Test: Fans Lash Out At Mitchell Starc Wife Alyssa Healy For Satires On Indian Players

బ్రిస్బేన్: 'మియా భాయ్ బన్‌గయా బడే భాయ్' ప్రస్తుతం టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ గురించి యావత్ క్రికెట్ ప్రపంచం చెబుతున్న మాట. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఈ హైదరాబాద్ గల్లీ బాయ్(5/73) ఐదు వికెట్లతో చెలరేగాడు. గాయాలతో సీనియర్ బౌలర్లు దూరమైన వేళ.. తన మూడో మ్యాచ్‌లోనే బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాడు. నడిపించడమే కాదు నాయకుడిగా తనదైన బౌలింగ్‌తో ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన సిరాజ్.. ప్రతికూల పరిస్థితుల్లో కెరీర్ బెస్ట్ గణంకాలను అందుకున్నాడు.

సిరాజ్ కుర్రాడు కాదు..

సిరాజ్ కుర్రాడు కాదు..

ఓవైపు తండ్రి మరణం.. మరోవైపు జాతి వివక్ష వ్యాఖ్యలు.. ఇవేవి సిరాజ్ ఏకాగ్రతను దెబ్బతీయలేదు. భారత్ తరఫున ఆడాలనే తన తండ్రి కలను నెరవేర్చే లక్ష్యంతోనే ముందుకు సాగాడు. దాన్ని సాకారం చేసుకొని యావత్ క్రికెట్ ప్రపంచం మన్ననలు పొందాడు. ఇప్పుడు సచిన్‌ మొదలు క్రికెట్‌ దిగ్గజాలంతా అతని అంకితభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ అయితే ఈ సిరీస్‌తో సిరాజ్ మగాడిగా అవతరించాడని కొనియాడాడు.

స్టార్క్ కంటే సిరాజ్‌కే..

స్టార్క్ కంటే సిరాజ్‌కే..

ఈ నేపథ్యంలో ఓ ఆసీస్ అభిమాని సిరాజ్ బౌలింగ్‌ను ప్రశంసిస్తూ ట్విటర్ వేదికగా మిచెల్ స్టార్క్‌పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. 'హతవిధీ..మిచెల్ స్టార్క్ కంటే ఈ సిరీస్‌లో సిరాజే ఎక్కువ వికెట్లు తీశాడు.'అని ట్వీట్ చేశాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లే ఆడిన సిరాజ్ మొత్తం 13 వికెట్లు తీయగా.. స్టార్క్ 11 వికెట్లే దక్కించుకున్నాడు. అయితే ఈ ట్వీట్‌తో ఆగ్రహానికి గురైన స్టార్క్ సతీమణి, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలీసా హీలీ.. సదరు అభిమాని వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది.

స్టార్క్‌కు సామర్థ్యం లేదా?

స్టార్క్‌కు సామర్థ్యం లేదా?

'మీ వ్యాఖ్యలు చాలా ఫన్నీగా ఉన్నాయి. సిరాజ్ ప్రదర్శన అతని సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అతని కష్టానికి దక్కిన ఫలితం అది'అని బదులిచ్చింది. ఈ సమాధానంతో మరింత ఆగ్రహానికి గురైన సదరు అభిమాని..'అంటే.. నీ భర్తకు వికెట్లు తీసే సామర్థ్యం, కష్టపడే తత్వం లేదంటావా?'అని ఘాటుగా బదులిచ్చాడు. ఈ ట్వీట్‌తో ఒకింత ఆశ్చర్యానికి లోనైన అలీసా..'అయ్యో అదేం లేదు. భారత యువ ఆటగాడి ప్రతిభను గుర్తించాలంటున్నా. ఈ సిరీస్‌లో అతని కష్టాన్ని ప్రశంసించమని కోరుతున్నా'అని బదులిచ్చింది. దీంతో అలీసా కూల్ కూల్ అంటూ ఇతర అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Story first published: Tuesday, January 19, 2021, 13:12 [IST]
Other articles published on Jan 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X