
సచిన్ సరసన..
అలాగే 1999లో కెప్టెన్‌గా మెల్‌బోర్న్‌లో సెంచరీ చేసిన సచిన్ టెండూల్కర్ సరసన ఇప్పుడు రహానే కూడా చేరాడు. ఈ రికార్డుతో ఆసియా కెప్టెన్ల జాబితాలో కూడా చోటు సంపాదించుకున్నాడు. సచిన్, హానీఫ్ మహ్మద్, మహ్మద్ యూసఫ్ తర్వాత ఈ ఫీట్ సాధించిన సారథిగా రహానే నిలిచాడు. ఓవరాల్ టెస్ట్ కెరీర్‌లో రహానేకు ఇది 12వ సెంచరీ కాగా.. మెల్‌బోర్న్‌లో రెండోది. దాంతో మెల్‌బోర్న్ వేదికగా ‘బాక్సింగ్ డే' టెస్టులో రెండు సెంచరీలు చేసిన భారత దిగ్గజ ప్లేయర్ వినూ మన్కడ్ రికార్డును రహానే సమం చేశాడు. 2014లో ఇదే మైదానంలో రహానే 147 పరుగులు చేశాడు.

కోహ్లీని వెనక్కు నెట్టి..
ఇక మెల్‌బోర్న్ మైదానంలో మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే 342 పరగులు చేశాడు. దాంతో ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(316) వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఐదు టెస్ట్‌ల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 449 రన్స్‌తో టాప్‌లో ఉండగా.. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 280 రన్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా 17 ఇన్నింగ్స్‌ల్లో డాన్ బ్రాడ్‌మన్ 1671 రన్స్‌తో టాప్‌లో ఉన్నాడు. ఇందులో 9 సెంచరీలు కూడా ఉన్నాయి.

భారత్ 326 ఆలౌట్..
ఇక 277/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. మరో 49 పరుగులకే చాపచుట్టేసింది. సెంచరీ హీరో రహానే రనౌటవ్వడంతో టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. రన్ తేడాలో చివరి మూడు వికెట్లు కోల్పోవడంతో రహానే సేన ఫస్ట్ ఇన్నింగ్స్ 326 పరుగులకు ముగిసింది. దాంతో భారత్‌కు 131 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం సెకండ్ ఇన్నింగస్ ప్రారంభించిన ఆసీస్‌కు ఉమేశ్ యాదవ్ గట్టి షాకిచ్చాడు. ఓపెనర్ బర్న్స్(4)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన లబుషేన్(19 బ్యాటింగ్) మరో ఓపెనర్ మాథ్యూ వేడ్(5 బ్యాటింగ్)తో పోరాడుతున్నాడు.


Click it and Unblock the Notifications
