రనౌట్ చేసిన ఆ సాయంత్రమే కోహ్లీతో మాట్లాడా: అజింక్యా రహానే

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్ టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో 36/9పరుగులకే పరిమితమై పరువు తీసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆది నుంచి ఆధిపత్యం కనబర్చిన కోహ్లీసేన ఒక్క సెషన్‌లోనే పేలవ బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రనౌట్ మ్యాచ్‌ను ఆసీస్‌వైపు మలుపు తిప్పింది. రహానే కారణంగానే సెంచరీ దిశగా దూసుకెళ్లిన విరాట్ కోహ్లీ అనూహ్యంగా రనౌటయ్యాడు.

విరాట్‌కు క్షమాపణలు చెప్పా..
దాంతో పటిష్టంగా ఉన్న భారత్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఆ ఒక్క వికెట్ కోల్పోవడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. ఇక కోహ్లీ ఔట్‌కు కారణమైన రహానే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు పెటర్నిటీ లీవ్ మీద కోహ్లీ భారత్‌కు వచ్చేయడంతో తాత్కలిక సారథిగా జట్టును నడిపించనున్నాడు. శనివారం నుంచి మెల్ బోర్న్ వేదికగా రెండో టెస్ట్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన రహానే..ఈ రనౌట్ వ్యవహారంపై స్పందించాడు. ఆ సాయంత్రమే విరాట్ దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పానని స్పష్టం చేశాడు.

క్రికెట్‌లో సహజం..
‘నిజంగా ఆ రనౌట్ నా తప్పిదమే. అది మాకు తీవ్రని నష్టం చేసింది. ఆ సమయంలో విరాట్, నేను ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లున్నాం. మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. కానీ ఆ ఒక్క రనౌట్ ఆసీస్‌కు కలిసొచ్చింది. ఆ రోజు ఆట ముగిసిన వెంటనే నేను విరాట్ దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాను. అతను కూడా ఏం అనలేదు. ఆ పరిస్థితిని మేం ఇద్దరం అర్థం చేసుకున్నాం. వాస్తవానికి మేం మంచి స్థితిలో ఉన్నాం. కానీ క్రికెట్‌లో ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. దాన్ని గౌరవించి ముందుకు సాగాలంతే'అని రహానే చెప్పుకొచ్చాడు.

మా సామర్థ్యం మేరకు రాణించాలి..
ఇక రెండో టెస్ట్‌లో తమ శక్తీమేరకు రాణించాలని, మంచి శుభారంభాన్ని అందుకోవాలన్నాడు. ‘మెల్‌బోర్న్‌లో మాకు మంచి రికార్డే ఉంది. కానీ మంచి ఆరంభం దక్కడం ముఖ్యం. 2018, 2014లో ఈ మైదానంలో మంచి ఫలితాలు సాధించాం. ఆ జోరునే కొనసాగించాలి. అన్నికన్నా ముఖ్యమైంది పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మా శక్తీ సామర్థ్యం మేరకు రాణించాల్సిన అవసరం ఉంది. అప్పుడే విజయం సాధించగలం'అని రహానే చెప్పుకొచ్చాడు.

కోహ్లీ మాకు ఒక్కటే చెప్పాడు..
ఆసీస్‌ను వీడే ముందు కోహ్లీ పాజిటీవ్‌గా ఉండమని చెప్పాడని రహానే తెలిపాడు. ‘వెళ్లేముందు డిన్నర్‌లో విరాట్ టీమ్‌తో మాట్లాడాడు. పాజిటివ్‌గా ఉండాలని చెప్పాడు. కేవలం మా బలాలతోనే కలిసికట్టుగా ఆడమన్నాడు. గతకొన్నేళ్ల టీమ్ విజయాలకు అదే కారణమని, వ్యక్తిగతంగా రాణిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఇతరుల సక్సెస్‌ను ఆస్వాదించమన్నాడు'అని రహానే పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications