India vs Australia: ముగిసిన రెండో రోజు ఆట... రహానే సెంచరీ.. భారత్‌కు భారీ ఆధిక్యం!

మెల్‌బోర్న్: అడిలైడ్ టెస్ట్ దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ జట్టు ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయిస్తుంది. తొలి రోజు ఆటలో సూపర్ బౌలింగ్‌తో బౌలర్లు దెబ్బతీయగా.. రెండో రోజు ఆటలో బాధ్యతాయుత బ్యాటింగ్‌తో బ్యాట్స్‌మెన్ ఆకట్టుకున్నారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ విఫలమైనా.. కీలక ఆటగాళ్లు చేతులెత్తేసినా.. రహానే(200 బంతుల్లో 12 ఫోర్లతో 104 బ్యాటింగ్) సెంచరీ పోరాటం టీమిండియాను మెరుగైన స్థితిలో నిలిపింది.
దాంతో ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. క్రీజులో రహానేతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(104 బంతుల్లో 40 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు తీయగా.. లయన్ ఓ వికెట్ తీశాడు.

ఫస్ట్ సెషన్‌లో తడబాటు..
36/1 ఓవర్ 36/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఆసీస్ స్టార్ పేసర్ కమిన్స్ ధాటికి ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ (45), చతేశ్వర పుజారా (17)స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్ వరుస ఓవర్లలో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి ఆసీస్‌కు మంచి శుభారంభాన్ని అందించాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అజింక్యా రహానే, హనుమ విహారి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దాంతో భారత్ 90/3 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

కీలక భాగస్వామ్యాలు..
భోజన విరామం తర్వాత కూడా రహానే-విహారీ ఆసీస్ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్నారు. ఓపికగా ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఇక 50కి పైగా పరుగుల భాగస్వామ్యంతో క్రీజలో నిలదొక్కుకున్న ఈ జోడీని లయన్ దెబ్బతీశాడు. ఫోర్ బాది జోరు మీదున్న విహారిని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన విహారీ.. బంతిని తప్పుగా అంచనా వేసి స్లిప్‌లో ఉన్న స్మిత్‌కు చిక్కాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

దూకుడుగా పంత్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఓవైపు రహానే నిదానంగా ఆడుతున్నా మరోవైపు పంత్ వన్డే స్టైల్లో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కమిన్స్ వేసిన 53 ఓవర్‌లో రెండు ఫోర్లతో 12 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత కాస్త తగ్గి క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసినా.. స్టార్క్ దెబ్బతీశాడు. కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన జడేజాతో రహానే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
రహానే సెంచరీ..
ఈ క్రమంలో 111 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే.. జడేజా సాయంతో తన క్లాసిక్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఇక కొత్త బంతి అందుకున్న ఆసీస్‌కు.. 73 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రహానే స్లిప్ క్యాచ్ ఇవ్వగా.. స్టీవ్ స్మిత్ నేలపాలు చేశాడు. ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న రహానే.. మరింత జాగ్రత్తగా ఆడుతూ విలువైన సెంచరీ సాధించాడు. ఇది రహానేకు 12వ టెస్ట్ సెంచరీ కాగా.. అడిలైడ్ ఘోర పరాజయం తర్వాత.. అది విరాట్ కోహ్లీ లేని మ్యాచ్‌లో జట్టును నడిపిస్తూ సాధించిన ఈ శతకం అతనికి ప్రత్యేకంగా నిలవనుంది.
ఆ వెంటనే 104 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టార్క్ బౌలింగ్ రహానే ఇచ్చిన క్యాచ్‌ను ట్రావిస్ హెడ్ చేజార్చాడు. అయితే ఆ బంతి రహానే బొటన వేలుతోపాటు హెల్మెట్‌ను బలంగా తాకుతూ గాల్లోకి లేచింది. దాంతో టీమిండియా ఫిజియో రహానేను పరీక్షించింది. ఇక మైదానంలో భారీ గాలులు వీస్తూ.. వర్ష సూచన ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను ముందుగానే నిలిపివేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications