
2018 నుంచి డౌన్..
హోమ్‌గ్రౌండ్‌లో కంటే విదేశాల్లో మంచి రికార్డు ఉన్న అజింక్యా పెర్ఫామెన్స్ 2018 నుంచి డౌన్ అవుతూ వస్తోంది. వైస్ కెప్టెన్ అయినప్పటికీ బాగా ఆడకుంటే తుది జట్టులో ప్లేస్ గ్యారంటీ లేదు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు పెటర్నిటీ లీవ్ తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో మిగతా మూడు టెస్ట్‌ల్లో టీమ్‌ను నడిపించబోతున్నాడు. తమ టెస్ట్ హిస్టరీలోనే లోయెస్ట్ స్కోర్ చేసి పరువు పోగొట్టుకున్న టీమ్‌ను నడిపించే బాధ్యత భుజాలపై వేసుకున్న రహానే కెరీర్‌కు ఈ సిరీస్ కీలకం కానుంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కెప్టెన్‌గా బ్యాట్స్‌మన్‌గా తన మార్కు చపెడితే అతని దశ తిరగడం ఖాయం.!

సువర్ణావకాశం..
అడిలైడ్‌లో చేసిన మిస్టేక్స్‌ను సరిదిద్దుకునేందుకు.. ఆస్ట్రేలియాకు దీటుగా బదులిచ్చేందుకు రహానే, టీమిండియాకు ఇంకా మూడు టెస్ట్‌లు ఉన్నాయి. ఒకరకంగా ఇది సానుకూల విషయమే అనొచ్చు. ఒకవేళ సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో భారత్ ఇలా చిత్తుగా ఓడితే వెంటనే పుంజుకునే అవకాశం ఉండేది కాదు. కాబట్టి రహానే ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి. బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ ఫైనల్ ఎలెవన్‌లో అనేక మార్పులు అనివార్యం. రహానే చేయాల్సిన మొదటి పని మేనేజ్‌మెంట్‌తో కలిసి ఈ మ్యాచ్‌లో సరైన టీమ్‌ను ఎంచుకోవడమే. ఇది వరకు రెండు టెస్ట్‌ల్లో భారత్‌ను నడిపించిన అనుభవం ఉన్న ఈ ముంబైకర్ ఫస్ట్ మ్యాచ్‌లోనే సారధిగా తన మార్క్ చూపించాడు.

ఆశ్చర్యపరిచినా గెలిపించాడు..
2017లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్‌లో భుజం గాయం కారణంగా కోహ్లీ తప్పుకోగా.. రహానే పగ్గాలు అందుకున్నాడు. తీవ్ర ఒత్తిడి ఉన్న ఆ పోరులో కోహ్లీ లేకపోవడంతో బలహీనమైన బ్యాటింగ్ యూనిట్‌ను బలోపేతం చేసుకోకుండా ఎక్స్‌ట్రా బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు అరంగేట్రం అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కానీ ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్, బౌలింగ్ మార్పులతో ఆసీస్‌కు సవాల్ విసిరాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్‌లో వార్నర్ దంచికొడుతున్న టైమ్‌లో కుల్దీప్‌తో బౌలింగ్ చేయించి అతని వికెట్ రాబట్టాడు. ఆపై చిన్న టార్గెట్ చేధనలో తక్కువ స్కోర్‌కే రెండు వికెట్లు పడ్డ టైమ్‌లో తన స్టైల్‌కు భిన్నంగా 27 బంతుల్లోనే 38 రన్స్ కొట్టి టీమ్‌ను గెలిపించడంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సహా పలువురు మాజీలు ప్రశంసలు కురిపించారు. ఈ ఒక్క ఉదాహరణతో తన కెప్టెన్సీ జడ్జ్‌మెంట్ ఇవ్వడం సరైనది కాకపోయినా.. ధర్మశాల పెర్ఫామెన్స్ రహానే ఈ సిరీస్ మితా మూడు మ్యాచ్‌ల్లో రిపీట్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

బ్యాటింగ్ భారం మోయాల్సిందే..
కెప్టెన్‌గానే కాదు బ్యాటింగ్‌లోనూ జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఇప్పుడు రహానే ముందుంది. భారత్ బ్యాటింగ్‌కు మూలస్తంభం లాంటి కోహ్లీ గైర్హాజరీలో ఓ బ్యాట్స్‌మన్‌గా అతనిపై మరింత ఒత్తిడి ఉండటం ఖాయం. అయితే బ్యాట్స్‌మన్‌గా అజింక్యా కెరీర్ సాఫీగా ముందుకు సాగడం లేదు. భారత్‌లో కంటే విదేశాల్లో మంచి రికార్డు ఉన్న అతికొద్ది మంది ఆటగాళ్లలో ఒకడైన రహానే ఈ మధ్య పెద్దగా ఆకట్టుకోవడం లేదు.
కానీ మెల్ బోర్న్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో రహానే రాణించడం కీలకం. వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా రహానే ముందడుగు వేసి బాగా పెర్ఫామ్ చేయాల్సిన సమయం వచ్చిందని సిరీస్‌కు ముందే కోహ్లీ చెప్పాడు. ఇప్పుడు బంతి రహానే కోర్టులోనే ఉంది. మరి అతనేం చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications
