ఆ ఒక్కడి వైఫల్యమే టీమిండియా కొంపముంచింది: ఆడమ్ గిల్‌క్రిస్ట్

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ టెస్ట్‌లో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలి ఇజ్జత్ తీసుకున్న విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ ముందు వరకు ప్రత్యర్థిపై పైచేయి సాధించిన కోహ్లీ సేన.. ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలి అత్యల్ప స్కోర్ అప్రతిష్టను మూటగట్టుకుంది. అయితే ఈ ఘోర పరాజయం వెనుక ఉన్న కారణాలను క్రికెట్ ఎక్స్‌పర్ట్స్, ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. తదుపరి మ్యాచ్‌ల్లో రాణించడానికి పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ కూడా భారత జట్టుకు విలువైన సలహా ఇచ్చాడు.
ఘోర పరాజయానికి కారణం టెక్నిక్ సమస్యతో బాధపడుతున్న టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషానేనని కారణమన్నాడు. ఆరంభంలోనే అతను వికెట్ పారేసుకోవడం జట్టు బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. తదుపరి మ్యాచ్‌కు అతన్ని తీసుకునేముందు టీమ్ మేనేజ్‌మెంట్ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నాడు.

ఆరంభంలోనే ఔటవ్వడం..
‘రెండు ఇన్నింగ్స్‌ల్లో పృథ్వీ షా(0, 4) ఆరంభంలోనే ఔటవ్వడం టీమ్ బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. ఇతర బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి నెలకొనెలా.. వెనుకడుగేసేలా చేసింది. షా గత పర్యటనలో కూడా ఉండటంతో అతని చుట్టూ బాగా హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో అతను నిశిత పరిశీలనకు గురయ్యాడు. షా బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపం ఉందనే విషయం స్పష్టంగా అర్థమైంది. అతని బ్యాట్, ప్యాడ్ మధ్య ఉన్న గ్యాప్‌ను టార్గెట్ చేస్తే వికెట్ తీయవచ్చని తెలిసిపోయింది. ఇదే వ్యూహాన్ని అమలు చేసిన ఆసీస్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫలితాన్ని రాబట్టింది.

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా..
ఇక షా అద్భుత బ్యాట్స్‌మెన్. ఆస్ట్రేలియా పరిస్థితులపై భారీ షాట్లు ఆడగలడు. గల్లీ షాట్స్ బాగా ఆడుతాడు. కానీ ఫస్ట్ టెస్ట్‌లోని అతని ప్రదర్శన టీమ్‌మేనేజ్‌మెంట్‌ను గందరగోళంలో పడేసింది. తదుపరి మ్యాచ్‌కు ఆడించాలా? వద్దా? అనే సందిగ్ధతను క్రియేట్ చేసింది. వాస్తవానికి విరాట్ కోహ్లీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్, పుజారా నెమ్మదైన బ్యాటింగ్, రహానే బాధ్యతాయుత ఆట లేకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా భారత్ దారుణంగా విఫలమయ్యేది. ఆ ఇద్దరి అద్భుత బ్యాటింగ్ కారణంగానే 244 పరుగులు చేసింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ త్రయం విఫలమవడంతో టీమిండియా బ్యాటింగ్ కుప్పకూలింది. 'అని మిడ్‌డేకు రాసిన కాలమ్‌లో గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.

ఫ్లాఫ్ 36..
విరాట్ కోహ్లీ, పుజారా, రహానే సూపర్ బ్యాటింగ్‌తో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసింది. దాంతో 62 రన్స్ ఆధిక్యం లభించింది. కానీ శనివారం ఆటలో 16 ఓవర్ల వ్యవధిలో అంతా తలకిందులైంది. మధ్యాహ్నం ఒక గంట ఆట అత్యంత చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. కమిన్స్, హేజిల్ వుడ్ విరుచుకుపడటంతో మన బ్యాట్స్‌మెన్ అంతా నేల చూపులు చూశారు. 9/1 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. చూస్తుండగానే ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 53 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ స్కోరు 89 పరుగులకు చేరింది. 90 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఆడుతూ పాడుతూ ఛేదించింది.

షా ఔట్.. గిల్ ఇన్..
ఇక ఫస్ట్ టెస్ట్‌లో దారుణంగా విఫలమైన షాకు రెండో టెస్ట్‌లో చోటు దక్కడం కష్టమే. అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు అవకాశం రానుంది. ఇక పెటర్నిటీ లీవ్ మీద కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కు రానుండటంతో జట్టును రహానే లీడ్ చేయనున్నాడు. దాంతో జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విరాట్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి రానుండగా.. గాయపడ్డ షమీ ప్లేస్‌లో మహ్మద్ సిరాజ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ 26 నుంచి ప్రారంభంకానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications