Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టీవ్ స్మిత్‌‌కు మరో అవకాశం ఇస్తే తప్పేంటి? సెలెక్టర్లు ఈ చర్చకు తెరదించాలి: గిల్‌క్రిస్ట్

India vs Australia: Adam Gilchrist opens up on Steve Smith captaincy debate

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు మరోసారి సారథ్య బాధ్యతలు అప్పగిస్తే తప్పేంటని ఆ దేశ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ప్రశ్నించాడు. స్మిత్‌ తిరిగి కెప్టెన్‌ అవుతాడా లేదా అన్న ఊహాగానాలకు తెరదించాలని ఆసీస్ సెలక్టర్లను కోరాడు. 2018 బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌ ఏడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అతనిపై విధించిన రెండేళ్ల కెప్టెన్సీ నిషేధం కూడా ఇటీవలే ముగిసింది. దాంతో స్మిత్‌ను మరోసారి సారథి చేయాలనే చర్చ ఊపందుకుంది. భారత్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఈ డిమాండ్ మరింత గట్టిగా వినిపిస్తుంది.

ఈ డిబేట్‌పై తాజాగా స్పందించిన గిల్‌క్రిస్ట్.. అతనికి రెండో అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించాడు. 'స్మిత్‌కు రెండో అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు గల కారణమైతే నాకు కనిపించడం లేదు. అతను అద్భుతమైన ఆటగాడు. స్మిత్‌ కెప్టెన్సీ అందుకోవడానికి సెలక్టర్లకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే, అతనూ కూడా సిద్ధంగా ఉంటే.. వెంటనే వైస్‌ కెప్టెన్‌గా నియమించాలి.

అప్పుడు పెయిన్, ఫించ్ ఎవరూ తప్పుకున్నా సహజ పద్దతిలో స్మిత్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఊహాగానాలకు చర్చకు తెరిదించినట్లు అవుతుంది. అతని క్రికెట్ ప్రయాణం గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. వైస్ కెప్టెన్ చేస్తే.. కెప్టెన్ మార్పుపై హైప్ లాంటివి ఏవి ఉండవు. ప్రతీ ఒక్కరికి ఓ క్లారిటీ ఉంటుంది.'అని గిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, December 14, 2020, 15:39 [IST]
Other articles published on Dec 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+