Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: పొరపాటు చేశా.. సిరాజ్, సైనీ క్షమించండి: గిల్‌క్రిస్ట్

India vs Australia: Adam Gilchrist apologises to Navdeep Saini and Mohammed Siraj

సిడ్నీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం సిడ్నీ క్రికెట్ మైదానంలో తొలి వ‌న్డేలో భార‌త్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచులో ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఓ పొరపాటు చేశాడు. చేసిన పొరపాటును ఓ అభిమాని ద్వారా తెలుసుకున్న గిల్‌క్రిస్ట్.. తన తప్పును సరిదిదుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు టీమిండియా ఫాస్ట్ బౌలర్లకు క్షమాపణలు చెప్పాడు. ఈ మ్యాచులో గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యాతగా ఉన్నాడు. అసలు విషయంలోకి వెళితే..

సైనీ తండ్రి చనిపోయాడంటూ:

సైనీ తండ్రి చనిపోయాడంటూ:

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ జరుగుతుండగా కామెంట్రీ ప్యానెల్‌లో ఉన్న ఆడమ్ గిల్‌క్రిస్ట్.. భారత ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ తండ్రి ఇటీవల చనిపోయారంటూ తప్పుగా మాట్లాడాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ అభిమాని.. చనిపోయింది సైనీ నాన్న కాదు.. మహ్మద్ సిరాజ్ వాళ్ల తండ్రి అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అంతేకాదు తప్పిదం సరి చేసుకోండని గిల్లీకి సూచించాడు. వెంటనే స్పందించిన గిల్‌క్రిస్ట్.. తన తప్పిదాన్ని అంగీకరించాడు. తాను తప్పుగా ప్రస్తావించానన్న గిల్లీ.. సిరాజ్, సైనీని క్షమాపణలు కోరాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు.

 హుందాగా క్షమాపణలు:

హుందాగా క్షమాపణలు:

అప్పటి వరకూ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సారీ చెప్పాలని డిమాండ్ చేసిన భారత అభిమానులు.. ఆస్ట్రేలియా దిగ్గజం హుందాగా క్షమాపణలు కోరడంతో ఫ్యాన్స్ శాంతించారు. సైనీ, సిరాజ్ ఇద్దరూ ఐపీఎల్ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడటంతో గిల్‌క్రిస్ట్ పొరబడ్డాడు. ఈ క్రమంలోనే తప్పుగా వ్యాఖ్యానం చేశాడు.గిల్లీ పొరపాటును గమనించిన న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్ మెక్‌క్లేగాన్.. సైనీ కాదు, సిరాజ్ తన తండ్రిని కోల్పోయాడని ఫాక్స్ క్రికెట్‌కు ట్వీట్ చేశాడు. అంతేకాదు సిరాజ్ ఫ్యామిలీకి సానుభూతి వ్యక్తం చేశాడు.

ఫించ్ సెంచ‌రీ:

ఫించ్ సెంచ‌రీ:

తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ సెంచ‌రీ చేశాడు. వ‌న్డేల్లో అత‌నికిది 17వ సెంచ‌రీ కావ‌డం విశేషం. 117 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో ఫించ్ సెంచరీ పూర్తి చేశాడు. వార్న‌ర్‌తో క‌లిసి తొలి వికెట్‌కు 156 ప‌రుగులు జోడించాడు. ఆపై వార్నర్ హాఫ్ సెంచరీ బాధగా.. స్మిత్ సెంచరీ చేశాడు. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 374 రన్స్ చేసింది.

ఫించ్‌, స్మిత్‌ శతకాలు.. దంచికొట్టిన మాక్స్‌వెల్.. భారత్‌ లక్ష్యం 375!!

Story first published: Friday, November 27, 2020, 14:05 [IST]
Other articles published on Nov 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+