For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆడు మామ ఆడు.. తెలుగులో విహారిని ఎంకరేజ్ చేసిన అశ్విన్!

India vs Australia: Aadu mama aadu R Ashwin eggs on Hanuma Vihari in Telugu in Sydney Test
India vs Australia 3rd Test : 'Aadu Mama Aadu' Ashwin Encourages Hanuma Vihari In Telugu || Oneindia

సిడ్నీ: అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత జట్టు బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ కీలక సమరంలో ఓటమిని తప్పించుకుంది. ఆస్ట్రేలియాతో సోమవారం మూడో టెస్టును 'డ్రా'గా ముగించిన టీమిండియా సిరీస్‌లో 1-1తోనే సమాన స్థితిలో నిలిచింది. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్‌ స్కోరు 98/2తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (118 బంతుల్లో 97; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా, చతేశ్వర్‌ పుజారా (205 బంతుల్లో 77; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు.

అనంతరం హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్‌; 4 ఫోర్లు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (128 బంతుల్లో 39 నాటౌట్‌; 7 ఫోర్లు)ల మారథాన్‌ భాగస్వామ్యంతో మ్యాచ్‌ 'డ్రా'గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్‌లో నిలిచి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించారు.

ఆడు మామ ఆడు..

ఆడు మామ ఆడు..

భారత క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారీ ఓటమి తప్పించేందుకు అసాధారణంగా పోరాడారు. తొడ కండరాల గాయంతో కనీసం రన్నింగ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న యువ ఆటగాడు విహారిని సీనియర్ అశ్విన్ ఎప్పటికప్పుడూ ప్రోత్సహించాడు. ఓవైపు ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడినా.. ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా సహచరుడిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో తమిళ్, తెలుగులో మాట్లాడుతూ విహారిని ప్రోత్సహించాడు. 'ఆడు మామ ఆడు'అని తెలుగులో.. 'పటు పటు బాల్ ఆడనమ్' అని తమిళ్లో అనడం స్టంప్ మైక్స్‌లో రికార్డు అయింది.

100 బంతుల్లో 6 పరుగులు..

100 బంతుల్లో 6 పరుగులు..

50 బంతుల్లో 4 పరుగులు... 100 బంతుల్లో 6 పరుగులు... అవసరమైనప్పుడు జిడ్డుగా ఆడటం ఏమిటో ఈ ఆంధ్ర క్రికెటర్‌ ఇలా చూపించాడు! ఎట్టకేలకు దాదాపు మ్యాచ్‌ ఫలితం తేలిన తర్వాత 125 బంతికి అతని తొలి ఫోర్‌ వచ్చింది. మధ్యలో కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నా సరే... లక్ష్యం చేరే వరకు ఆగకూడదని భావించిన విహారి చివరికంటా నిలిచి తన విలువేమిటో చూపించాడు. ఇప్పుడు అన్ని వైపుల నుంచి అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అతను ఆడిన శైలి అద్భుతమంటూ ప్రముఖులు పొగుడుతున్నారు. దురదృష్టవశాత్తూ తర్వాతి టెస్టుకు దూరమవుతున్నా... విహారి సిడ్నీ ప్రదర్శనను ఎవరూ రాబోయే రోజుల్లో మరచిపోరు. భారత అభిమానుల దృష్టిలో అతను ప్రాణం పోతున్న సమయంలో సంజీవని తెచ్చి బతికించిన హనుమంతుడు!

అశ్విన్‌కే సాధ్యమైంది..

అశ్విన్‌కే సాధ్యమైంది..

ముగ్గురు టాప్‌ పేసర్లు విరుచుకుపడుతున్నా అతను వెన్ను చూపలేదు. చివరి సెషన్‌లో ఆసీస్‌ బౌలర్లు తొలి బంతి నుంచే బౌన్సర్లతో అశ్విన్‌పై విరుచుకుపడ్డారు. కమిన్స్‌ బంతి పక్కటెముకలకు తగిలిన సమయంలోనైతే అతను విలవిల్లాడిపోయాడు. ఫిజియో చికిత్స చేయాల్సి వచ్చింది. ఆపై పదే పదే తన చెస్ట్‌ గార్డ్‌ను సరి చేసుకుంటూ అతను జాగ్రత్త పడ్డాడు. ఏ బంతి ఆడినా ఫీల్డర్‌ చేతుల్లో పడుతుందేమో అన్నంత తీవ్ర ఒత్తిడిలో ఆడిన అశ్విన్‌ చివరకు తన బ్యాటింగ్‌ సత్తా ప్రదర్శించాడు. ఆసీస్‌ బౌలర్లకు మ్యాచ్‌లో అవకాశం ఇవ్వకుండా కొన్ని చక్కటి షాట్లు ఆడి జట్టును గట్టెక్కించాడు. అశ్విన్‌ టెస్టు కెరీర్‌లో నాలుగు సెంచరీలు ఉన్నా... వాటితో పోలిస్తే ఇక్కడ సాధించిన పరుగుల విలువే ఎక్కువ.

 గాయపడకుంటే..

గాయపడకుంటే..

'పుజారా మరికొంతసేపు ఉండి, నాకు గాయం కాకపోతే ఫలితం మరోలా ఉండేది. డ్రా మంచి రిజల్టే అయినా పరిస్థితులు బాగుండి ఇంకాస్త పోరాడితే మెరుగైన ఫలితం వచ్చేది. టెస్టు మ్యాచ్‌ చివరి రోజు బ్యాటింగ్‌ చేసి ఇలా జట్టును కాపాడటం ఎంత సంతృప్తినిచ్చిందో మాటల్లో చెప్పలేను. గెలిచి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. ఆట ముగిసిన తర్వాత కూడా మా ఆనందాన్ని ఎలా చూపించాలో కూడా అర్థం కాలేదు.'అని విహారీ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, January 12, 2021, 9:02 [IST]
Other articles published on Jan 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+