Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా.. జట్టు కూర్పుపై తేలిన లెక్క.. షా ఔట్, సిరాజ్ డౌట్!

 India vs Australia A: Practice game ends in draw but India find few answers ahead of Test series
Ind Vs Aus : Bumrah’s Straight Drive Hits Cameron Green, Siraj Rushes For Help

సిడ్నీ: టీమిండియా, ఆస్ట్రేలియా-ఏ మధ్య గులాబీ బంతితో జరిగిన సన్నాహక మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగిసింది. ఆఖరి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా-ఏ నాలుగు వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. బెన్‌ మెక్‌డెర్మాట్‌ (167 బంతుల్లో 16 ఫోర్లతో 107 నాటౌట్), జాక్ వైల్డెర్‌మత్ ( 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 111 నాటౌట్) అజేయ సెంచరీలతో సత్తాచాటారు. అలెక్స్‌ క్యారీ (58) అర్ధశతకంతో రాణించాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చెలరేగిన బౌలర్లు ప్రతికూల పిచ్‌ పై ప్రభావం చూపలేకపోయారు. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో అద్భుతాలు చేయలేకపోయారు. మహ్మద్ షమీ రెండు వికెట్లు, హనుమ విహారి, సిరాజ్‌ చెరో వికెట్ తీశారు.

అజేయ శతకాలతో..

అజేయ శతకాలతో..

ఇక 473 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. షమీ (2/58), సిరాజ్‌ (1/54) ధాటికి 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన క్యారీతో బెన్ ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. క్యారీని విహారి ఔట్ చేయడంతో 117 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన జాక్‌తో కలిసి బెన్‌ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో వీరిద్దరు శతకాలు అందుకున్నారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో జో బర్న్స్‌ (1), మార్కస్‌ హారిస్‌ (5), నిక్ (14) పరుగులు చేశారు.

 టీమ్‌పై క్లారిటీ..

టీమ్‌పై క్లారిటీ..

అంతకు ముందు భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 386/4 డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 194 రన్స్‌కే ఆలౌటైన భారత్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో విహారీ, రిషభ్ పంత్ సెంచరీలతో భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఫలితం రాకున్నా.. ఫస్ట్ టెస్ట్‌కు ముందు తుది జట్టు కూర్పుపై టీమ్‌మేనేజ్‌మెంట్‌కు ఓ అవగాహన ఏర్పడింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో విహారి బ్యాటింగ్‌లో రాణిస్తుండటంతో పాటు స్పిన్నర్‌గా ఫర్వాలేదనిపించాడు. దాంతో లోయర్ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా అతడికి తుదిజట్టులో అవకాశాలు పెరిగాయి.

పృథ్వీ షా ఔట్..

పృథ్వీ షా ఔట్..

పంత్ కూడా లయను అందుకోవడం సానుకూలాంశం. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌ అలరించాడు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీతో పాటు తుదిజట్టులో ఉండే మరో ఇద్దరు పేసర్లు ఎవరనేది తేలలేదు. రెండో వామప్‌ మ్యాచ్‌కు విశ్రాంతినిచ్చిన ఉమేశ్ యాదవ్‌కు జట్టులో చోటు ఉంటుందని భావిస్తున్నారంతా. అలా అయితే మహ్మద్ సిరాజ్‌, నవ్‌దీప్ సైనీలో ఒకరికి మాత్రమే అవకాశం లభిస్తుంది. కాగా, రెండు సన్నాహక మ్యాచ్‌ల్లో పృథ్వీ షా ఆశించిన స్థాయిలో సత్తాచాటలేకపోవడంతో శుభ్‌మన్ గిల్‌, మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశాలు ఉన్నాయి.

 గందరగోళంలో ఆసీస్

గందరగోళంలో ఆసీస్

మరోవైపు ఆసీస్‌కు ఓపెనర్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. గాయంతో సీనియర్‌ ఓపెనర్‌ వార్నర్, కంకషన్‌తో యువఓపెనర్‌ పకోస్కీ జట్టుకు దూరమయ్యారు. అయితే పకోస్కీ స్థానంలో జట్టులోకి వచ్చిన హారిస్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో మొత్తంగా 31 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌ జో బర్న్స్‌ (0, 1) ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఆస్ట్రేలియాకు ఓపెనర్ల సమస్య ఏర్పడింది. కాగా, నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా డిసెంబర్‌ 17న అడిలైడ్ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.

సంక్షిప్త స్కోర్లు:

సంక్షిప్త స్కోర్లు:

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 194 ఆలౌట్‌; ఆస్ట్రేలియా-ఎ తొలి ఇన్నింగ్స్‌: 108 ఆలౌట్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 386/4 (డిక్లేర్‌); ఆస్ట్రేలియా-ఎ రెండో ఇన్నింగ్స్: 307/4

Story first published: Sunday, December 13, 2020, 18:52 [IST]
Other articles published on Dec 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+