For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెలరేగిన షమీ, సైనీ.. ప్రాక్టీస్‌లో ఆస్ట్రేలియా విల విల.. భారత్‌కు భారీ ఆధిక్యం!

India vs Australia A: All-round Jasprit Bumrah, Mohammed Shami star as 20 wickets fall on Day 1

సిడ్నీ: నాలుగు టెస్ట్‌ల సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న డే నైట్ సన్నాహక మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. గులాబీ బంతితో ప్రత్యర్థిని చెడుగుడు ఆడారు. బ్యాట్స్‌మెన్ విఫలమైనా.. మహ్మద్ షమీ (3/29), నవ్‌దీప్ సైనీ (3/19), జస్‌ప్రీత్ బుమ్రా (2/33)లతో కూడిన భారత పేస్ త్రయం రప్ఫాడించడంతో ఆస్ట్రేలియా ఏ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో అలెక్స్‌ క్యారీ (32), హ్యారిస్‌ (26) టాప్ స్కోరర్లు కాగా.. నలుగురు బ్యాట్స్‌మెన్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.

బ్యాటింగ్‌లోనూ బూమ్ బూమ్ బుమ్రా..

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌‌ను 194 పరుగులకు ముగించింది. శుభ్‌మన్‌ గిల్ (43), పృథ్వీ షా (40) మినహా మిగిలిన బ్యాట్స్‌మన్‌ తేలిపోయిన వేళ జస్‌ప్రీత్ బుమ్రా (55 నాటౌట్) అజేయ అర్ధశతకంతో సత్తా చాటాడు. ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లో బుమ్రాకు ఇదే తొలి హాఫ్ సెంచరీ కాగా.. సిక్సర్‌తో ఈ ఘనతను అందుకోవడం విశేషం. 123 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మహ్మద్ సిరాజ్‌ (22)తో కలిసి బుమ్రా ఆదుకున్నాడు. ఆఖరి వికెట్‌కు 71 పరుగులు జోడించి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.

నలుగురు సున్నా.. ముగ్గురు సింగిల్ డిజిట్‌కే

నలుగురు సున్నా.. ముగ్గురు సింగిల్ డిజిట్‌కే

అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు 108 పరుగులకే కుప్పకూలింది. దాంతో భారత్‌కు ఫస్ట్ ఇన్నింగ్స్ 86 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్ల ధాటికి జోబర్న్స్, బెన్, సీన్ అబాట్, విల్ సుతెర్లాండ్ ఖాతా తెరవకుండానే క్రీజును వీడారు. మరో ముగ్గురు బ్యాట్స్‌మన్ సింగిల్ డిజీట్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్‌ బరిలోకి దిగలేదు. రిఫభ్ పంత్‌ వికెట్‌కీపింగ్ బాధ్యతలు అందుకోగా వృద్దిమాన్ సాహా ఫీల్డింగ్ చేశాడు. ఇక మూడు రోజుల ఈ వామప్ గేమ్‌లో భారత్ గెలవాలంటే.. రేపు భారీ స్కోర్ చేసి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాలి.

కామెరూన్‌ గ్రీన్‌కు కంకషన్‌

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్‌ గ్రీన్‌ కంకషన్‌కు గురయ్యాడు. జస్‌‌ప్రీత్ బుమ్రా ఆడిన షాట్‌‌ గ్రీన్ ముఖానికి నేరుగా తగిలింది. వెంటనే నాన్‌స్ట్రైకర్‌ సిరాజ్‌.. గ్రీన్‌ వద్దకు వెళ్లి పరిశీలించాడు. క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించిన అనంతరం గ్రీన్ మైదానాన్ని వీడాడు. అయితే అతడికి కంకషన్‌ స్వల్ప లక్షణాలు కనిపించాయని జట్టు వైద్యులు తెలిపారు. అతడి స్థానంలో పాట్రిక్‌ మైదానంలోకి వచ్చాడు. కాగా, తొలి వామప్‌ మ్యాచ్‌లో గ్రీన్ సెంచరీ చేయగా.. పకోస్కీ కూడా కంకషన్‌కు గురైన సంగతి తెలిసిందే. కార్తిక్‌ త్యాగి విసిరిన బౌన్సర్‌ అతని తలకు బలంగా తగిలింది.

Story first published: Friday, December 11, 2020, 20:45 [IST]
Other articles published on Dec 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+