For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia 3rd T20I: మాథ్యూ వేడ్, మ్యాక్సీ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం!

India vs Australia 3rd T20I: Mathew Wade, Glenn Maxwell propel Australia to 186

సిడ్నీ: మాథ్యూవేడ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80), గ్లేన్ మ్యాక్స్‌వెల్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆఖరి టీ20లో ఆసీస్.. భారత్ ముందు 187 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత ఫీల్డర్ల వైఫల్యంతో అవకాశాలు అందుకున్న ఈ జోడీ మూడో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో ఆసీస్..నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సుంధర్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, ఠాకుర్ తలో వికెట్ పడగొట్టారు.

శుభారంభం లేదు..

శుభారంభం లేదు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(0) సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో మాథ్యూ వేడ్ దూకుడుగా ఆడాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టపోయి 51 పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ స్కోర్ వేగం తగ్గింది. దాంతో స్మిత్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.

వేడ్ బ్యాక్ టూ బ్యాక్ ఫిఫ్టీ..

వేడ్ బ్యాక్ టూ బ్యాక్ ఫిఫ్టీ..

ఈ క్రమంలో వాషింగ్టన్ సుంధర్ బౌలింగ్‌లో స్మిత్(24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఈ ఓవర్‌ ఫస్ట్ బంతికే స్టంపౌట్ కావాల్సిన స్మిత్.. కీపర్ కేఎల్ రాహుల్ తప్పిదంతో బతికిపోయాడు. కానీ మరో మూడు బంతుల వ్యవధిలోనే వెనుదిరగడంతో రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తరువాత మ్యాక్సీ క్రీజులోకి రాగా.. ఆసీస్ స్కోర్ బోర్డు వేగం పెరిగింది. ఈ క్రమంలో మాథ్యూవేడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నటరాజన్ వేసిన 11వ ఓవర్‌లో లెగ్‌సైడ్ క్విక్ డబుల్‌తో 49 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో వేడ్‌కు వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం.

మైదానంలో డ్రామా..

మైదానంలో డ్రామా..

ఈ హాఫ్ సెంచరీకి ముందే అంపైర్ తప్పిదంతో వేడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దాంతో మైదానంలో డ్రామా చోటు చేసుకుంది. నట్టూ ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. అయితే భారత్ నిర్ణీత సమయంలో రివ్యూ తీసుకోలేదు. కానీ టీవీ రీప్లేలో ఔటైనట్లు స్పష్టమైంది. దాంతో కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఆ వెంటనే మ్యాక్సీ లక్కీగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చాహల్ వేసిన 13వ ఓవర్ ఆఖరి బంతిని మ్యాక్సీ భారీ షాట్‌కు ప్రయత్నించగా బంతి గాల్లోకి లేచింది. అప్రమత్తమైన కీపర్ కేఎల్ రాహుల్ బంతిని చాకచక్యంగా అందుకున్నాడు. ఇక మ్యాక్సీ కూడా మైదానం వీడేందుకు సిద్దమయ్యాడు. బౌండరీ లైన్ వరకు వెళ్లగా.. మరో బ్యాట్స్‌మన్ కూడా గ్రౌండ్‌లోకి వచ్చాడు. కానీ అప్పుడే థర్డ్ అంపైర్ నోబాల్ అని ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. మ్యాక్సీ మళ్లీ తిరిగొచ్చాడు.

మ్యాక్సీ చాలా లక్కీ..

మ్యాక్సీ చాలా లక్కీ..

ఈ అవకాశంతో చెలరేగిన మ్యాక్సీ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దానికి తోడు భారత ఆటగాళ్ల క్యాచ్‌లు విడిచిపెట్టడం అతనికి కలిసొచ్చింది. దాంతో మరింత ధాటిగా ఆడిన అతను.. నట్టూ వేసిన 18వ ఓవర్‌లో ఫోర్ కొట్టి 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే శార్దుల్ వేసిన 19వ ఓవర్‌లో వేడ్ ఎల్బీగా వెనుదిరగ్గా.. నట్టూ వేసిన ఆఖరి ఓవర్‌లో మ్యాక్సీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే డీఆర్సీ షార్ట్ రనౌట్ కావడంతో ఆసీస్ దూకుడు తగ్గింది. చివరి ఐదు ఓవర్లలో 47 పరుగులే రావడంతో ఆ జట్టు 186 పరుగులకే పరిమితమైంది.

Story first published: Tuesday, December 8, 2020, 15:51 [IST]
Other articles published on Dec 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+