India vs Australia, 2nd T20I: చెలరేగిన మాథ్యూ, స్మిత్.. భారత్ ముందు భారీ లక్ష్యం! ఆకట్టుకున్న నట్టూ!

సిడ్నీ: మాథ్యూ వేడ్(38 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 58) ఫాస్టెస్ట్ ఫిఫ్టీకి స్టీవ్ స్మిత్(38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) బాధ్యతాయుత ఇన్నింగ్స్ తోడవడంతో భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా 195 పరుగుల భారీ లక్ష్యాన్ని 5నిర్ధేశించింది. ఈ ఇద్దరికి తోడుగా మ్యాక్స్‌వెల్(22), హెన్రీక్స్(25) మెరుపులు మెరిపించడంతో ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నటరాజన్ (2/20) మినహా అంతా విఫలయ్యారు. చాహల్(1/51), ఠాకూర్ (1/39) తలో వికెట్ తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. చాహర్(0/48), సుంధర్(0/35) పూర్తిగా తేలిపోయారు.

చెలరేగిన మాథ్యూవేడ్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు తాత్కలిక కెప్టెన్ మాథ్యూ వేడ్ మంచి శుభారంభాన్ని అందించాడు. ఫస్ట్ బాల్ నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డ వేడ్ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఈ స్థితిలో బంతిని నటరాజన్‌కు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫలితం రాబట్టాడు. ఓపెనర్ డీఆర్సీ షాట్(9)ను అయ్యర్ సూపర్ క్యాచ్ సాయంతో నట్టూ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను హార్దిక్ పాండ్యా జారవిడిచాడు. దాంతో మరింత ధాటిగా ఆడిన అతను 25 బంతేల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

లక్కీ రనౌట్..
అయితే సుంధర్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లోనే మాథ్యూవేడ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ జారవిడచగా.. ఔటైనట్లు భావించిన అతను నిర్లక్షంగా వెనుదిరిగే ప్రయత్నం చేశాడు. కానీ స్మిత్ అలర్ట్ చేయడంతో మళ్లీ క్రీజులోకి రావడానికి యత్నించినప్పటికీ.. కోహ్లీ, రాహుల్‌కు బంతిని అందివ్వడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్ భారత్‌కు చేయాల్సిన నష్టం చేశాడు. 13 బంతులే ఆడిన అతను రెండు భారీ సిక్సర్లతో 22 పరుగులు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న అతన్ని ఠాకూర్ ఔట్ చేశాడు.

చెలరేగిన స్మిత్..
ఈ క్రమంలో స్మిత్ తన బ్యాటింగ్ వేగం పెంచాడు. చాహల్ బౌలింగ్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చివరకు అతని బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి పాండ్యాకు చిక్కాడు. అయితే బంతి పాండ్యా చేతిలో దోబుచులాడినప్పటికీ ఆఖరి చిక్కింది. చివర్లో హెన్రీక్స్ (25)ను నట్టూ ఔట్ చేయడంతో ఆసీస్ జోరు కొంచె తగ్గింది. అయితే స్టోయినిస్ (16 నాటౌట్), డానియల్ సామ్స్(8 నాటౌట్) బౌండరీలు రాబట్టడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications