Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia రెండో టీ20 జరగడం డౌటే!

IND vs AUS 2nd T20: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఆదివారం తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20లో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రపంచకప్ పరాజయం అనంతరం వైజాగ్ వేదికగా జరిగిన థ్రిల్లింగ్ టీ20లో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న టీమిండియా.. అదే ఉత్సాహంలో రెండో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌లో తమ ఆధిక్యాన్ని డబుల్ చేసుకోవాలనుకుంటోంది.

మరోవైపు తొలి టీ20లో ఎదురైన అనూహ్య పరాజయం నుంచి తేరుకోవాలని ఆసీస్ భావిస్తోంది. తృటిలో చేజారిన విజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు శుక్రవారమే తిరువనంతపురం చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌కు తిరువనంతపురంలోని గ్రీన్‌‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ మైదానం ఆతిథ్యం ఇస్తోంది.

 India vs Australia 2nd T20: Weather and pitch report from Greenfield Stadium in Trivandrum

అయితే ఈ మ్యాచ్‌కు ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారనుంది. ప్రస్తుతం అక్కడి వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఆదివారం మ్యాచ్ జరగడం కష్టమే అనిపిస్తోంది.

ప్రస్తుతం గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో మైదానం చిత్తడిగా మారింది. భారీ వర్షం కురవడంతో మైదానంలోని ఔట్ ఫీల్డ్ అంతా గుంతలు పడి నీళ్లు నిలిచిపోయాయి. దాంతో ఇరు జట్లు శనివారం ప్రాక్టీస్ చేయలేకపోయాయి. భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. రేపు ఉదయం నుంచి వర్షం రాకుండా బాగా ఎండ కొడితే మైదానం మ్యాచ్‌కు సిద్దం కానుంది. ఈ రోజులా వర్షం పడితే మాత్రం ఒక్క బంతి పడకుండానే వర్షం రద్దవ్వనుంది.

ప్రపంచకప్ ముందు ఈ మైదానంలో షెడ్యూల్ చేసిన వామప్ మ్యాచ్‌లన్నీ వర్షం కారణంగా బంతి పడకుండా రద్దయ్యాయి. AccuWeather రిపోర్ట్ ప్రకారం ఆదివారం 25 శాతం వర్షం పడే అవకాశం ఉంది.

పిచ్ రిపోర్ట్: తిరువనంతపురంలో ఇప్పటి వరకు మూడు టీ20లు మాత్రమే జరగాయి. ఇక్కడి పిచ్ చాలా నెమ్మదిగా ఉంటుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మైదానంలో చేజింగ్ చేయడమే ఉత్తమం. మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోంది.

తుది జట్లు(అంచనా)
భారత్:
రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్/ తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ

ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లీస్, మార్కస్ స్టోయినీస్, టీమ్ డేవిడ్, ఆరోన్ హార్దీ, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా

Story first published: Saturday, November 25, 2023, 19:55 [IST]
Other articles published on Nov 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+