Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia రెండో వన్డేకు భారీ అడ్డంకి!

ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఆటకు పదే పదే వర్షం ఆటంకం కలిగించడం అభిమానులకు చికాకు తెప్పించింది. చివరకు 26 ఓవర్ల ఆట సాధ్యం కాగా.. భారత్‌ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ(0), రోహిత్ శర్మ(8) దారుణంగా విఫలమయ్యారు.

వారి వైఫల్యం అభిమానులను మరింత బాధకు గురి చేసింది. అడిలైడ్ వేదికగా గురువారం రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆసీస్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా భారత్ ముమ్మరంగా సాధన చేస్తోంది.

India vs Australia 2nd ODI in Adelaide Will Rain Disrupt the Match Again

వర్షం ముప్పు.. కానీ

అయితే ఈ అడిలైడ్ వన్డేకు కూడా భారీ అడ్డంకి ఏర్పడనుంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అడిలైడ్‌లో వర్షాలు పడుతున్నాయి. మంగళవారం భారీ వర్షం కురిసింది. బుధవారం కూడా వరణుడు ప్రభావం చూపించే అవకాశం ఉంది. మ్యాచ్‌ రోజుకు వర్షం ముప్పు తక్కువగానే ఉన్నప్పటికీ.. ఈ లోపు తడిగా ఉన్న మైదానాన్ని ఆరబెట్టడం కష్టంగా మారనుంది.

ముఖ్యంగా పిచ్‌పై తడి లేకుండా చేసేందుకు మైదాన సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇందుకోసం యూవీ లైట్లను ఉపయోగిస్తున్నారు. అవి ఎక్కువ వేడిని ప్రసరింపజేసి పిచ్ త్వరగా ఆరేందుకు తోడ్పడనున్నాయి. వర్షం లేని సమయంలో ఈ లైట్లను వాడి పిచ్‌ను ఆరబెడుతున్నారు. పెర్త్ వన్డే తరహాలో భారీ వర్షం రాకున్నా.. స్వల్ప చిరజల్లులతో ఆటకు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రోజంతా మైదానాన్ని మబ్బులు కమ్మేసే అవకాశాలు ఉన్నాయి.

పిచ్ రిపోర్ట్..

అడిలైడ్ పిచ్ ఆస్ట్రేలియాలోనే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే వికెట్. పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. బౌన్స్ లభిస్తోంది. బ్యాటర్లకు స్వర్గదామంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలోనే స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే వికెట్ కూడా ఇదే. బంతి పాతబడిన తర్వాత స్పిన్నర్లకు పట్టు చిక్కుతుంది. భారత్ తమ అత్యుత్తమ స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

Story first published: Wednesday, October 22, 2025, 10:17 [IST]
Other articles published on Oct 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+