Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: వ‌ర‌ల్డ్ రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ.. ఒక్క సెంచరీ చేస్తే!!

India vs Australia 1st Test: Virat Kohli eye on Ricky Pontings world record

అడిలైడ్‌: సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా కంగారూల గడ్డపై ఉన్న విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్‌ను ముగించుకుని.. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం తీవ్రంగా సిద్ధమవుతోంది. డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రో వ‌ర‌ల్డ్ రికార్డుపై కన్నేశాడు. ఇప్ప‌టికే ఆస్ట్రేలియాతో ముగిసిన వ‌న్డే సిరీస్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్క‌ర్ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టిన కోహ్లీ.. ఇప్పుడు టెస్ట్ సిరీస్‌లో మ‌రో లెజెండ‌రీ బ్యాట్స్‌మ‌న్, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగ‌మించే అవ‌కాశాలు ఉన్నాయి.

మ‌రో సెంచ‌రీ చేస్తే

మ‌రో సెంచ‌రీ చేస్తే

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో 41 సెంచ‌రీలు చేశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా 41 సెంచ‌రీల‌తో కోహ్లీతో కలిసి టాప్‌లో ఉన్నాడు. మ‌రో సెంచ‌రీ చేస్తే కెప్టెన్‌గా అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన‌ వ‌ర‌ల్డ్ రికార్డును కోహ్లీ త‌న ఖాతాలో వేసుకుంటాడు. అయితే ఆస్ట్రేలియాలో ఈ రికార్డు అందుకోవ‌డానికి కోహ్లీకి ఒక టెస్ట్ మాత్ర‌మే అవకాశం ఉంది. తొలి టెస్ట్ త‌ర్వాత కోహ్లీ ఇండియాకు తిరిగి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. దీంతో అడిలైడ్‌లో జ‌ర‌గ‌బోయే డే/నైట్ టెస్ట్‌లోనే ఈ మైల్‌స్టోన్‌ను విరాట్ అందుకోవాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

వన్డేల్లో 43, టెస్టుల్లో 27 శతకాలు

వన్డేల్లో 43, టెస్టుల్లో 27 శతకాలు

ఆస్ట్రేలియాకు 324 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన రికీ పాంటింగ్ 41 సెంచరీలు చేయ‌గా.. విరాట్ కోహ్లీ మాత్రం కేవ‌లం 187 మ్యాచ్‌ల‌లోనే అత‌న్ని అందుకోవ‌డం విశేషం. అడిలైడ్ టెస్ట్‌లో మ‌రో సెంచ‌రీ చేయ‌గ‌లిగితే.. పాంటింగ్ కంటే ఎంతో ముందుగానే కెప్టెన్‌గా అత్య‌ధిక సెంచ‌రీల రికార్డును కోహ్లీ అందుకుంటాడు. ఒకవేళ ఈ రికార్డు ఈ టెస్టులో సాధ్యం కాకపోయినా.. వచ్చే ఏడాదయినా విరాట్ ఒక సెంచరీ చేస్తే చాలు. కోహ్లీ వన్డేల్లో 43, టెస్టుల్లో 27 శతకాలు బాదాడు. పాయింటింగ్ వన్డేల్లో 30, టెస్టుల్లో 41 శతకాలు చేశాడు. కోహ్లీ మరో సెంచరీ చేస్తే.. పాంటింగ్‌తో (71) కలిసి సమానంగా నిలుస్తాడు.

పితృత్వ సెలవులపై

పితృత్వ సెలవులపై

ఏడు దశాబ్దాల భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో గత పర్యటనలోనే టీమిండియా తొలిసారి ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గింది. ఈసారి ప్రత్యర్థి జట్టులో స్టీవ్ స్మిత్‌, మర్నస్ లబుషేన్‌, డేవిడ్ వార్నర్‌ వంటి నాణ్యమైన ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో కోహ్లీసేనకు విజయం అంత సులువు కాదు. తొలి టెస్టు అనంతరం విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి తిరిగి రానుండటం ఆస్ట్రేలియాకు కసిలిరావచ్చు. ఇక లోకేశ్‌ రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని టీమ్‌ఇండియా భావిస్తున్నది.

విదేశాల్లో తొలి పింక్ బాల్ టెస్ట్

విదేశాల్లో తొలి పింక్ బాల్ టెస్ట్

ఇక విదేశాల్లో టీమిండియా ఆడ‌బోతున్న తొలి పింక్ బాల్ టెస్ట్ ఇదే కావ‌డం కూడా ఈ మ్యాచ్‌కు మరింతప్రాధాన్య‌త సంతరించుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం బంగ్లాదేశ్‌తోనే అది కూడా సొంత‌గ‌డ్డ‌పై టీమిండియా డే/నైట్ టెస్ట్ ఆడింది. కలకత్తా వేదికగా జరిగిన ఆ టెస్టులో కోహ్లీసేన విజయం సాదించింది. ఇటీవలే కాలంలో ఆస్ట్రేలియా ప్రతి సిరీస్‌లో ఓ డే/నైట్ టెస్ట్ ఆడుతున్న విషయం తెలిసిందే.

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల.. 31 రోజులు, 31 మ్యాచ్‌లు!!

Story first published: Tuesday, December 15, 2020, 16:16 [IST]
Other articles published on Dec 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+