For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్టుకి ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. స్టీవ్‌ స్మిత్‌కు గాయం!!

India vs Australia 1st Test: Steve Smith walked out of the practice session with injury

అడిలైడ్‌: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభంకానుంది. తొలి టెస్టు (డే/నైట్‌)కు మరో రెండు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో చమటోడ్చుతున్నారు. మంగళవారం ఆస్ట్రేలియా జట్టు సాధన కఠోర సాధన చేసింది. అడిలైడ్‌ ఓవల్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌ ఆరంభమైన 10 నిమిషాలకే ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. నెట్స్‌లో మళ్లీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసేందుకు రాలేదు.

 స్మిత్‌కు గాయం:

స్మిత్‌కు గాయం:

బుధవారం వరకు స్టీవ్ స్మిత్‌ శిక్షణకు దూరంగా ఉంటాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. బంతిని అందుకునే క్రమంలో స్మిత్ గాయపడ్డాడని సీఏ అధికారి ఒకరు తెలిపారు. స్మిత్‌ వెన్నునొప్పికి చికిత్స తీసుకుంటున్నాడని అతడు వెల్లడించారు. అయితే స్మిత్ గాయం ఎలా ఉందో, తొలి టెస్ట్ ఆడుతాడో లేదో లాంటి సమాచారం మాత్రం తెలియరాలేదు. ఇక టీమిండియా‌తో సన్నాహాక మ్యాచ్‌లో నలుగురు ఆసీస్‌ ఆటగాళ్లు కంకషన్‌కు గురైన విషయం తెలిసిందే.

 అబాట్ ఔట్:

అబాట్ ఔట్:

ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ మోకాలి గాయం కారణంగా తొలి టెస్టు మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఇప్పటికే సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, యువ బ్యాట్స్‌మెన్ విల్ పకోస్కి గాయాల కారణంగా తొలి టెస్టు మ్యాచ్‌కి దూరమవగా.. తాజాగా గాయపడిన ఆసీస్ ఆటగాళ్ల సంఖ్య మూడుకి చేరింది. అయితే సీనియర్ ఆల్‌రౌండర్ హెన్రిక్స్ తొడ కండరాల గాయం నుంచి కోలుకుని మళ్లీ ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి రావడం ఒక్కటే ఆ జట్టుకి ఊరట.

 జట్టు కూర్పుపై ఆస్ట్రేలియా తర్జనభర్జన:

జట్టు కూర్పుపై ఆస్ట్రేలియా తర్జనభర్జన:

అడిలైడ్ వేదికగా గురువారం ఉదయం 9.30 గంటల నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌ని డే/నైట్ రూపంలో గులాబి బంతితో నిర్వహిస్తున్నారు. దాంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ మ్యాచ్‌కి ముందు గాయాలు ఆస్ట్రేలియా జట్టులో కంగారు పెంచుతున్నాయి. జట్టు‌లోకి హెన్రిక్స్ వచ్చినా.. అతడు టెస్టులు ఆడి దాదాపు నాలుగేళ్లవుతోంది. అలానే పకోస్కి స్థానంలో వచ్చిన ఓపెనర్ హారిస్ కూడా 2016లో చివరిగా టెస్టు ఆడాడు. దాంతో తుది జట్టు కూర్పుపై ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతోంది.

హిస్టరీ రిపీట్ చేయాలని:

హిస్టరీ రిపీట్ చేయాలని:

2018-19లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లిన భారత్.. నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1తో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆసియాకి చెందిన ఓ జట్టు టెస్టు సిరీస్ గెలవడం క్రికెట్ చరిత్రలో అదే తొలిసారి. దాంతో మరోసారి అదే హిస్టరీని రిపీట్ చేయాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్ట్ అనంతరం భారత్ తిరిగిరానుండడం టీమిండియాను కాస్త కలవరపెడుతోంది. రోహిత్ శర్మ చివరి రెండు టెస్టులకు అందుబాటులోకి రావడం కలిసొచ్చే అంశం.

India vs Australia: వ‌ర‌ల్డ్ రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ.. ఒక్క సెంచరీ చేస్తే!!

Story first published: Tuesday, December 15, 2020, 17:56 [IST]
Other articles published on Dec 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+