న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: టీ20ల్లో రికార్డు.. 9 మ్యాచ్‌లుగా టీమిండియాకు ఓటమే లేదు!!

India vs Australia 1st T20I: Team India have not lost their last 9 T20 matches

కాన్‌బెర్రా: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడి మనూకా ఓవల్‌ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతోంది. ఈ టీ20 ముందువరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో టీమిండియాకు ఓటమే లేదు. ఇది టీ20ల్లో టీమిండియాకు ఓ రికార్డు. టీ20ల్లో టీమిండియా ఇన్ని వరుస విజయాలు ఎప్పుడూ అందుకోలేదు. కరోనా వైరస్‌ మహమ్మారి రాక ముందు ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ గడ్డపై జరిగిన టీ20 సిరీస్‌ను కోహ్లీసేన 5-0తో గెలుచుకుంది. ఇందులో రెండు సూపర్ ఓవర్లు జరుగగా.. రెండింటిలోనూ భారత్ గెలుచుకుంది.

 వెస్టిండీస్ సిరీస్‌ నుంచి:

వెస్టిండీస్ సిరీస్‌ నుంచి:

న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందు శ్రీలంకతో భారత్ ఆడింది. మూడు టీ20ల సిరీస్‌లో రెండు మ్యాచులను కోహ్లీసేన గెలవగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక 2019, డిసెంబర్ మాసంలో వెస్టిండీస్ జట్టుతో మూడు టీ20ల సిరీస్‌ ఆడింది. మొదటి మ్యాచ్ భారత్, రెండో మ్యాచ్ విండీస్, మూడో మ్యాచ్ భారత్ గెలిచింది. వెస్టిండీస్ సిరీస్‌లోని చివరి మ్యాచ్ నుంచి భారత్ ఓడిపోలేదు. అప్పటి నుంచి విజయాల పరంపర కొనసాగిస్తోంది. మరి ఈరోజు మ్యాచులో ఏం జరుగుతుందో చూడాలి.

 టీమిండియాకు మెరుగైన రికార్డే:

టీమిండియాకు మెరుగైన రికార్డే:

టీ20ల్లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు మెరుగైన రికార్డే ఉంది. ఈరెండు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో తలపడగా 11-8 తేడాతో భారత్‌దే పైచేయి. విజయాల శాతం 57.89. అయితే ఈ సిరీసుకు ముందు జరిగిన రెండు సిరీసుల్లోనూ కోహ్లీసేనకు మంచి ఫలితాలు రాలేదు. 2019 ఫిబ్రవరిలో ఉపఖండంలో ఆసీస్‌ పర్యటించింది. రెండు మ్యాచులు ఆడితే రెండూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. దానికి ముందు ఆసీస్‌లో పర్యటించిన భారత్ 3 టీ20ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది.

5 ఓవర్లకు 30 రన్స్

5 ఓవర్లకు 30 రన్స్

టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా త‌ర‌ఫున టీ న‌ట‌రాజ‌న్ టీ20 అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌కు పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్‌.. శిఖర్ ధావ‌న్‌తో క‌లిసి ఓపెనింగ్ చేశాడు. తుది జ‌ట్టులో మ‌నీష్ పాండే, సంజు శాంస‌న్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, దీప‌క్ చ‌హ‌ర్‌ల‌కు చోటు ద‌క్కింది. భారత్ 5 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 30 రన్స్ చేసింది. రాహుల్ (20), కోహ్లీ (7) క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. నటరాజన్‌ ఆరంగేట్రం.. అయ్యర్, బుమ్రా ఔట్!!

Story first published: Friday, December 4, 2020, 14:20 [IST]
Other articles published on Dec 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X