For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. నటరాజన్‌ ఆరంగేట్రం.. అయ్యర్, బుమ్రా ఔట్!!

India vs Australia 1st T20I: Australia have won the toss and have opted to field

కాన్‌బెర్రా: కాన్‌బెర్రా: ఆతిథ్య ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్‌ సమరానికి టీమిండియా రెడీ అయింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మరికొద్ది సమయంలో మనూకా ఓవల్‌ మైదానం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. డేవిడ్ వార్నర్ గాయంతో దూరమవడంతో డీఆర్సీ షార్ట్‌ ఓపెనర్‌గా రానున్నాడు. వేడ్‌ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక టీమిండియా తరఫున టీ20ల్లో టీ నటరాజన్‌ ఆరంగేట్రం చేస్తున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.

స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ లేకపోవడంతో కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా వస్తున్నాడు. శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంబిస్తాడు. శ్రేయాస్ అయ్యర్‌పై వేటు పడగా.. మనీశ్‌ పాండే, సంజు శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఇక అందరూ ఊహించినట్టే.. యుజ్వేంద్ర చహల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను కోహ్లీ తీసుకున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్థానంలో దీపక్ చహార్ ఆడుతున్నాడు. మొత్తానికి టీమిండియా పటిష్టంగా ఉంది.

న్డే జట్టుతో పోలిస్తే టీ20 ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా మంచి సమతూకంతో ఉంది. ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులోకి రావడం, రవీంద్ర జడేజా కూడా ఫామ్‌ అందుకోవడంతో భారత్‌కు ఆల్‌రౌండర్ల కొరత తీరినట్టే కనిపిస్తున్నది. దీంతో హార్దిక్‌ పాండ్య బంతి అందుకోకున్నా బౌలింగ్‌ వనరులు సరిపడా ఉన్నాయి. ఇప్పటికే 2-1తో వన్డే సిరీస్‌ గెలుపొందిన ఆస్ట్రేలియా ఇప్పుడు పొట్టి సిరీస్‌పైనా కన్నేసింది. మరోవైపు మూడో వన్డేలో విజయం సాధించిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో బోణీ కొట్టి తర్వాతి టీ20లపై పట్టుబిగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోటాపోటీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో తొలి టీ20పై ఆసక్తి పెరిగింది.

తుది జట్లు:
భారత్: కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ ‌(కెప్టెన్‌), మనీష్ పాండే, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చహర్‌, టీ నటరాజన్‌, మొహమ్మద్ షమీ.

ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్ ‌(కెప్టెన్‌), డిఆర్కీ షార్ట్‌, మాథ్యూ వేడ్‌, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మొయిసెస్ హెన్రిక్స్‌, సీన్‌ అబోట్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వీప్సన్‌, ఆడం జంపా ,జోష్‌ హాజిల్‌వుడ్.

Story first published: Friday, December 4, 2020, 13:37 [IST]
Other articles published on Dec 4, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+