రాహుల్ హాఫ్ సెంచరీ.. జడేజా విధ్వంసం.. ఆస్ట్రేలియా టార్గెట్ 162!!

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 రన్స్ చేసి.. ఆస్ట్రేలియా ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 రన్స్ బాదాడు. ఇన్నింగ్స్ చివరలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విధ్వంసం (44; 23 బంతుల్లో, 5×4, 1×6) సృష్టించాడు. ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలు బాదాడు. జడేజా ఆదుకోకుంటే టీమిండియా ఆ మాత్రం స్కోర్ కూడా చేసుండేది కాదు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2, హెన్రిక్స్ 3 వికెట్లు పడగొట్టాడు.

కోహ్లీ విఫలం
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే కోహ్లీసేనకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (1) త్వరగానే పెవిలియన్ చేరాడు. మూడో ఓవర్‌లో గబ్బర్‌ను మిచెల్ స్టార్క్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (9)తో కలిసి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ వేగంగా పరుగులు సాధించడంతో పవర్‌ప్లేలో భారత్ 42 పరుగులు సాధించింది. కాగా ఏడో ఓవర్‌లో కోహ్లీని స్పిన్నర్ స్వెప్సన్ ఔట్ చేశాడు. దీంతో భారత్ కష్టాలో పడింది.

రాహుల్ హాఫ్ సెంచరీ
కోహ్లీ అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సంజు శాంసన్ (23; 15 బంతుల్లో, 1×4, 1×6)తో పాటు కేఎల్ రాహుల్ ధాటిగా ఆడటంతో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. లాఫ్టెడ్ షాట్లతో వీరిద్దరు బౌండరీలు బాదారు. ఈ క్రంమలోనే రాహుల్ హాఫ్ సెంచరీ బాదాడు. కానీ ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఆరు పరుగుల వ్యవధిలోనే శాంసన్, మనీష్ పాండే (2), కేఎల్ రాహుల్ ఔటవ్వడంతో భారత్ 92 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

జడేజా విధ్వంసం
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా (16; 15 బంతుల్లో, 1×6) ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయాడు. దీంతో టీమిండియా మోస్తరు స్కోరుకే పరిమితమవుతుంది అందరూ అనుకున్నారు. అయితే ఇన్నింగ్స్ చివరలో రవీంద్ర జడేజా విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి ధాటికి ఆఖరి మూడు ఓవర్లలో భారత్ 46 పరుగులు పిండుకుంది. వాషింగ్టన్ సుందర్ (7) పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో హెన్రిక్స్ మూడు, స్టార్క్ రెండు.. స్పెప్సన్, జంపా తలో వికెట్ తీశారు.

జడేజాకు గాయం
వేగంగా బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజా.. 18వ ఓవర్‌లో తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి చికిత్స చేసిన అనంతరం అతడు బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే స్వేచ్ఛగా మాత్రం కదలలేకపోయాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో జడ్డు బౌలింగ్ చేయడంపై సందేహాలు నెలకొన్నాయి.
IPL 2021లో కొత్త ఫార్మాట్.. లీగ్ దశలో అన్ని జట్లు కలిపి 14 మ్యాచ్‌లే!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications