Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021లో కొత్త ఫార్మాట్!! 10 జట్లు రెండు గ్రూపులు.. అయినా లీగ్ దశలో 14 మ్యాచ్‌లే!

New format for IPL 2021, 10 teams will be divided into two groups

ముంబై: వ‌చ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌లో)కి రెండు కొత్త జట్లు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ మేర‌కు డిసెంబ‌ర్ 24న జ‌ర‌గబోయే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్‌)లో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ స‌మావేశం కోసం 23 పాయింట్ల‌తో ఎజెండాను కూడా బోర్డు సిద్ధం చేసింది. 2020 ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వ‌హించ‌డం ద్వారా వ‌చ్చిన న‌ష్టాన్ని ఈ కొత్త టీమ్స్‌తో రాబ‌ట్టుకోవాల‌న్న‌ది బీసీసీఐ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది.

రెండు కొత్త జట్లు

రెండు కొత్త జట్లు

నిజానికి పది జట్లతో ఐపీఎల్‌ నిర్వహణ బోర్డుకు కొత్తేం కాదు. తొమ్మిదేళ్ల క్రితమే పది జట్లు (పుణే వారియర్స్, కొచ్చి టస్కర్స్‌) ఐపీఎల్‌లో తలపడ్డాయి. అయితే ఈ పది జట్ల ముచ్చట 2013లోనే ముగిసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత విస్తరణ తెర మీదికొచ్చింది. దీనికి ప్రధాన కారణం అదానీ గ్రూప్‌. గుజరాత్‌కు చెందిన ఈ కార్పొరేట్‌ సంస్థ అహ్మదాబాద్‌ వేదికగా ఫ్రాంచైజీ కోసం ఆసక్తి కనబరుస్తోంది. ఇదివరకే రెండేళ్లు రైజింగ్‌ పుణే ఫ్రాంచైజీ ఉన్న సంజీవ్‌ గోయెంకాకు చెందిన ఆర్పీజీ సంస్థ కూడా తిరిగి వచ్చేందుకు తహతహలాడుతోంది. దీనికి లక్నో వేదిక కావచ్చు.

14కి బదులు 18 మ్యాచ్‌లు

14కి బదులు 18 మ్యాచ్‌లు

అయితే ఐపీఎల్ 2021 సీజన్లో ఒక జట్టే బరిలో దిగుతుందని.. ఆ తర్వాతి సీజన్లో పదో ఫ్రాంచైజీ బరిలో దిగుతుందని వార్తలొచ్చాయి. ఏదేమైనా ఈసారి అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పేరు ఖాయమైందని సమాచారం. ఇక ప్రస్తుతం పాల్గొనే ఎనిమిది జట్లు రౌండ్ రాబిన్ పద్దతిలో ఒక్కో జట్లతో రెండుసార్లు తలపడుతున్నాయి. దీంతో లీగ్ దశలో ఒక జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఐపీఎల్ 2021కి రెండు జట్లు వస్తే.. ఈ పద్దతి ప్రకారం మ్యాచుల సంఖ్య 18కి చేరుకుంటుంది. అప్పుడు సుదీర్ఘ ఐపీఎల్ సీజన్ అవనుంది. ఈ ఫార్మాట్ నిర్వహించడం కూడా బీసీసీఐకి పెద్ద తలనొప్పే. అందుకే బీసీసీఐ 2011 ఫార్మాట్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది.

10 జట్లు రెండు గ్రూపులు

10 జట్లు రెండు గ్రూపులు

2011లో 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయాయి. లీగ్ దశలో అన్ని జట్లు 14 మ్యాచ్‌లే ఆడాయి. ఇదే విధానాన్ని వచ్చే సీజన్లోనూ అనుసరిస్తారని సమాచారం తెలుస్తోంది. జట్లను రెండు బృందాలుగా చేసినప్పటికీ ఒక్కో జట్టు లీగు దశలో 14 మ్యాచులే ఆడుతుంది. అంటే ఒక్కో జట్టు తన బృందంలోని మరో జట్టుతో రెండు సార్లు తలపడుతుంది. అవతలి బృందంలోని జట్లతో ఒక్కో మ్యాచు ఆడుతుంది. మిగిలిన ఒక జట్టుతో రెండుసార్లు ఆడుతుంది. ఎక్కువ పాయింట్లు వచ్చిన నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. జట్లను విడదీసేందుకు డ్రా తీస్తారు.

India vs Australia: టీ20ల్లో రికార్డు.. 9 మ్యాచ్‌లుగా టీమిండియాకు ఓటమే లేదు!!

Story first published: Friday, December 4, 2020, 18:04 [IST]
Other articles published on Dec 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+