Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: భారత్ X అఫ్గాన్ ఏకైక టెస్ట్.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టెస్ట్ ఫార్మాట్‌ ఆడేందుకు సిద్దమైంది. శనివారం ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో ప్రారంభమయ్యే ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా తలపడనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన సన్నాహకాలను టీమిండియా పూర్తి చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే ఈ ఏకైక టెస్ట్ ఉండటంతో భారత ఆటగాళ్లు ఎలా ఆడుతారా? అనే ఆసక్తి నెలకొంది.

అంతేకాకుండా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం టెస్ట్‌ల్లో టీమిండియా ఆశించిన ఫలితాలను సాధించలేకపోతుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా 6వ స్థానంలో కొనసాగుతోంది. అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్ డబ్ల్యూటీసీలో భాగం కాకున్నా.. ఈ మ్యాచ్‌ను సుదీర్ఘ ఫార్మాట్‌కు సన్నాహకంగా వాడుకోవాలని టీమిండియా భావిస్తోంది. టీమిండియాకు పసికూన అఫ్గాన్‌ ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి.

India vs Afghanistan Test 2026 Live Streaming Guide to Watch for Free Pitch Analysis and Weather Forecast

ఫ్రీగా ఎలా చూడాలంటే..?

భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఏకైక టెస్ట్‌కు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్‌లు చూడాలంటే చానెల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ప్రత్యేక రిచార్జ్ ప్లాన్స్‌తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. జియో యూజర్లు 328 ప్లస్ ఏ రిఛార్జ్ చేసుకున్నా మొబైల్ వర్షన్ జియో హాట్‌స్టార్ ఉచితంగా లభిస్తోంది.

పిచ్ రిపోర్ట్..

ముల్లాన్‌పూర్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. భారత్‌లో ఉండే ఇతర టెస్ట్ పిచ్‌ల తరహాలోనే ఇది కూడా తొలి రెండు రోజు బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. పేసర్లకు కొత్త బంతితో స్వింగ్ లభిస్తుంది. ఆ తర్వాత పిచ్‌పై పగుళ్లు ఏర్పడి స్పిన్‌కు సహకరిస్తోంది. టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

వాతావరణ రిపోర్ట్..

మ్యాచ్ జరిగే రోజుల్లో ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఆట పూర్తిగా నిలిచిపోయే అంత భారీ వర్ష సూచన లేదు. అయితే, కొన్ని సెషన్లలో ఒకట్రెండు సార్లు తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32°C- 36°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉక్కపోత ఎక్కువగా ఉండటం వల్ల ఆటగాళ్లకు కాస్త అలసట కలిగించవచ్చు. వాతావరణం పొడిగా ఉండటం వల్ల పిచ్ త్వరగా బీటలు వారే అవకాశం ఉంది, ఇది స్పిన్నర్లకు మరింత లాభిస్తుంది. ఓవరాల్‌గా వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగానే ఉంటుంది.

అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు ఎంపికైన భారత జట్టు

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్‌దూబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్.

Story first published: Friday, June 5, 2026, 16:23 [IST]
Other articles published on Jun 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+