కోహ్లీ గాయం నిజమే: టీమిండియా అసిస్టెంట్ కోచ్
అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడని, అఫ్గాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు దూరంగా ఉంటాడని వార్తలు వస్తున్నాయి.
కోహ్లీ గాయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే ఈ వార్తలను ధ్రువీకరించాడు. కోహ్లీ గాయం నిజమేనని, అతి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెప్పాడు. విరాట్ కోహ్లీ వంటి ఆటగాడు దూరమవ్వడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని అభిప్రాయపడ్డాడు.
టీమిండియాకు ఎదురు దెబ్బే..
శనివారం నుంచి అఫ్గానిస్థాన్‌తో టీమిండియా ఏకైక టెస్ట్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న ర్యాన్ టెన్ డస్కాటేను కోహ్లీ గాయం గురించి ప్రశ్నించగా.. అవుననే సమాధానమిచ్చాడు.

'విరాట్ కోహ్లీ గాయం గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. కానీ కోహ్లీలాంటి ఆటగాడు దూరమవ్వడం టీమిండియాకు తీరని లోటు.'అని డస్కాటే బదులిచ్చాడు. జూన్ 13 నుంచి 20 వరకు ఈ మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌తోనే వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహకాలు ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
ఐపీఎల్ ఫైనల్లో గాయం..?
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో అజేయ హాఫ్ సెంచరీతో ఆర్‌సీబీని గెలిపించాడు. ఈ మ్యాచ్‌లోనే కోహ్లీ తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఫిజియో మైదానంలోకి వచ్చి సపర్యలు కూడా చేశాడు. గాయాన్ని లెక్క చేయకుండా ఆఖరి వరకు క్రీజులో నిలబడిన కోహ్లీ.. ఆర్‌సీబీకి రెండో కప్పును అందించాడు.
మరోవైపు రోహిత్ శర్మ కూడా ఈ సిరీస్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఐపీఎల్ సమయంలోనే అతను తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడి కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తర్వాత రీఎంట్రీ ఇచ్చినా ఇంపాక్ట్ ప్లేయర్‌గా కేవలం బ్యాటింగ్‌కే పరిమితమయ్యాడు.
రోహిత్, హార్దిక్ సైతం..
రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా ..అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని సెలెక్టర్లు పేర్కొన్నారు. బెంగళూరులోని సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఈ ఇద్దరూ ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ ఇద్దరూ అక్కడికి వెళ్లలేదని తెలుస్తోంది. మరో వారం రోజుల్లోనే వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరూ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా దూరమైతే వారి స్థానాల్లో యువ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు.
అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్‌దూబే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications