IND vs AFG తొలి వన్డేకు భారీ అడ్డంకి!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో ప్రారంభం కావాల్సిన తొలి వన్డేకు భారీ అంతరాయం ఏర్పడింది. ధర్మశాల వేదికగా ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌కు భారీ వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా ఇంకా టాస్ కూడా వేయలేదు. మైదానాన్ని కవర్లతో కప్పేసారు. వర్షం ఆగితే తప్పా మ్యాచ్ జరిగే అవకాశాలు లేవు.
వర్షం తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఆక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్ర 4 గంటల నుంచి వాతావరణ తేలిక పడనుంది. మబ్బులు ఉన్నప్పటికీ.. వర్షం వచ్చే అవకాశాలు లేవు. అదే జరిగితే ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దాదాపు 2 గంటల ఆట రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ మ్యాచ్‌తోనే టీమిండియా వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహకాలు మొదలవ్వనున్నాయి. తొడ కండరాల గాయాలతో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరం కాగా.. రోహిత్ శర్మ బరిలోకి దిగుతున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శనపైనే అతని భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి రోహిత్ ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్నా.. ఐపీఎల్‌లో తొడ కండరాల గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో 50 ఓవర్ల ఫార్మాట్ మ్యాచ్‌ను ఎలా ఆడుతాడనేది సందేహంగా మారింది.
విరాట్ కోహ్లీ గైర్హాజరీలో అతని స్థానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. రాహుల్‌తో పాటు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌లను కూడా మూడో స్థానంలో ప్రయత్నించనున్నారు.
హార్దిక్ పాండ్యా స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి ఆడనున్నాడు. సీనియర్ బౌలర్లు బుమ్రా, సిరాజ్‌లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వడంతో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ కొత్త బంతితో బౌలింగ్ చేయనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

