Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాపం అశ్విన్... 4 టీమ్స్, 9 ఫైనల్స్.. 7 సార్లు ఓటమి! మామూలు గుండె కాదు!

India veteran spinner Ravichandran Ashwin lost 7 out of 9 ipl finals with 4 different teams

హైదరాబాద్: టీమిండియా వెటరన్ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ విచిత్ర రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ ఓడటంతో అత్యధిక ఫైనల్స్ ఓడిన ప్లేయర్‌గా అశ్విన్ నిలిచాడు. 15 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న అతి కొద్ది ప్లేయర్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్.. మొత్తం నాలుగు జట్లకు ప్రాతినిథ్యం వహించి 9 సార్లు ఫైనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఏడు సార్లు ఓటమిపాలయ్యాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున నాలుగు సార్లు(2008, 2012, 2013, 2015) తృటిలో టైటిల్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత రైజింగ్ పుణే(2017), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), రాజస్థాన్ రాయల్స్ తరఫున(2022) ఫైనల్లో ఓటమిపాలయ్యాడు. దాంతో నెటిజన్లు.. అశ్విన్‌ది మాములు గుండె కాదంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

చెన్నై తరఫున నాలుగు సార్లు..

చెన్నై తరఫున నాలుగు సార్లు..

2008లో చెన్నై సూపర్ కింగ్స్‌లో ఐపీఎల్ కెరీర్ ఆరంభించిన అశ్విన్, ఆ తర్వాత రైజింగ్ పూణే సూపర్ జెయింట్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల తరుపున ఆడాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఫైనల్‌లో చెన్నై ఓడిపోగా.. ఆ సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 2012, 2013, 2015 సీజన్లలో రన్నరప్‌గా ముగించిన చెన్నై టీమ్‌లో ప్లేయర్‌గా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున 2010, 2011 సీజన్లలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన రవిచంద్రన్ అశ్విన్, 2009 సీజన్లలో ప్లేఆఫ్స్‌కి చేరాడు.

ఏడు సార్లు ఓటమి..

ఏడు సార్లు ఓటమి..

2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌ ఫైనల్ చేరి, ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడింది.. ఆ సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరుపున ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 2020 సీజన్‌లో మొట్టమొదటి సారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌లో మెంబర్‌గా ఉన్నాడు. 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌లోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, టీమ్‌ని ఫైనల్ చేర్చినా రెండో టైటిల్ అందించలేకపోయాడు. ఓవరాల్‌గా 15 సీజన్లలో అశ్విన్, రెండు సార్లు టైటిల్ గెలవగా, 7 సార్లు ఫైనల్ మ్యాచుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు...

తొలి ప్లేయర్‌గా..

తొలి ప్లేయర్‌గా..

ఐపీఎల్ 2022 సీజన్‌లో అశ్విన్ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. మెగా వేలంలో రూ.5 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్.. అశ్విన్‌ను అన్ని విధాలుగా వాడుకుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో 17 మ్యాచులు ఆడి 7.51 ఎకానమీతో 12 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఓ హాఫ్ సెంచరీతో 141.48 స్ట్రైయిక్ రేటుతో 191 పరుగులు చేసి రాణించాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రిటైర్ ఔట్‌గా పెవిలియన్ చేరి, ఐపీఎల్‌, టీ20 ఫార్మాట్‌లోనే ఇలా ఔటైన మొదటి ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు.

Story first published: Thursday, June 2, 2022, 17:20 [IST]
Other articles published on Jun 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+