For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీడిన ఉత్కంఠ: విశాఖలోనే ఐదో వన్డే, 25 నుంచి టిక్కెట్ల అమ్మకాలు

By Nageshwara Rao

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య విశాఖపట్నంలో ఈనెల 29న జరగాల్సిన చివరి, ఐదో వన్డే యథాతథంగా జరుగుతుందని ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) కార్యదర్శి గోకరాజు గంగరాజు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదో వన్డేతో పాటు.. వచ్చే నెలలో భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరగనున్న టెస్టు మ్యాచ్‌కు విశాఖ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఅయితే గత రెండు నెలలుగా నెలకొన్న పిరిస్థితులు, మ్యాచ్‌ల నిర్వహణపై అనుమానాలను పెంచాయి. గత రెండు నెలలుగా విశాఖలో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో, పిచ్‌ బాగా పాడైపోయింది. ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దీంతో మ్యాచ్‌లు జరగకపొవచ్చు అన్న అనుమానాలు వచ్చాయి. అయితే వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఎక్కడ జారిపోతాయనే ఉద్దేశ్యంతో పట్టువదలకుండా, పిచ్‌ను మళ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఆతిధ్యమిచ్చేందుకు అనుకూలంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తయారు చేయించింది.

జరుగుతుందా, లేదా?: విశాఖలో వన్డే మ్యాచ్‌పై ఉత్కంఠఅనంతరం ఓసారి స్పెషలిస్ట్‌లను పంచి పిచ్‌ను పరీక్ష చేయించాలని బీసీసీఐని కోరింది. బీసీసీఐ నుంచి వచ్చిన క్యూరేటర్ కస్తూరి రంగన్ విశాఖ పిచ్‌ను పరిశీలించి, అంతర్జాతీయ మ్యాచ్‌లను జరిపించొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఈనెల 29న భారత్-కివీస్ మధ్య జరగాల్సిన చివరి, ఐదో వన్డే యథాతథంగా జరుగుతుంది.

దీనిపై గోకరాజ గంగరాజు కాస్తంత పట్టుదలగానే ఉన్నారు. విశాఖలో మ్యా చ్‌ను నిర్వహించడంపై కొన్ని వర్గాల నుంచి అను మానాలు వ్యక్తమవుతున్నా.. వన్డేను విజయవంతగా జరిపి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అలాగే వచ్చే నెల 17 నుంచి 21 మధ్య ఇదే వేదికపై జరిగే భారత-ఇంగ్లండ్‌ టెస్ట్‌ను కూడా విజయవంతం చేస్తామని అన్నారు.

కాగా, భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఈ నెల 29న జరిగే ఐదో వన్డే టిక్కెట్లను మంగళవారం (అక్టోబర్ 25) నుంచి అందుబాటులో ఉంటాయి. స్టేడియం వద్ద, ఈ సేవ కేంద్రాల్లో, ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని ఏసీఏ తెలిపింది. ఈ మ్యాచ్‌కు టిక్కెట్ ధరలు కనిష్టం రూ.400 కాగా గరిష్టం రూ.5000గా ధర నిర్ణయించింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+