విశాఖపట్నం: భారత్‌లో భారత జట్టుపై వన్డే సిరిస్ గెలిచి చరిత్ర సృష్టించాలనే తపన ఒకరిది. పాత చరిత్రను పునరావృతం చేయాలని ఆరాటం మరొకరిది. ఇలా ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరిస్ విజేత ఎవరనేది శనివారం విశాఖపట్నంలో జరగనున్న వన్డే మ్యాచ్‌లో తేలనుంది.
56 పరుగుల దూరంలో ధోని: ఆ రికార్డుని సాధిస్తాడా?కాగా, ఇప్పటివరకు భారత గడ్డపై న్యూజిలాండ్ ద్వైపాక్షిక సిరీస్ గెలవలేదు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో జరగనున్న ఐదో వన్డేకి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. మొన్నటి వరకు మ్యాచ్ జరుగుతుందో లేదో అనే ఉత్కంఠ, అయితే కయాంత్ తుఫాన్ బలహీన పడటంతో విశాఖలో గెలుపెవరిదనేది ఆసక్తికరంగా మారింది.

వన్డే జట్టులో ధోని స్థానం సుస్ధిరం మొదలైంది ఇక్కడ నుంచే
ఏప్రిల్ 5, 2005 భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజుకు, విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. టీమిండియాకు కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ధోని కెరీర్ ప్రస్థానం ఇక్కడే ఉపందుకుంది.
అంతక ముందు వరకు ధోని ఆడిన నాలుగు వన్డేల్లో 0, 12, 7, 3 పరుగులకే పరిమితమైన ధోని... విశాఖపట్నంలో జరిగిన ఐదో వన్డేలో సెంచరీతో చెలరేగిపోయాడు. అది కూడా భారత్ చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై. మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
విశాఖలో ఐదో వన్డే: న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తుందా?
ఈ మ్యాచ్‌లో ధోని 123 బంతుల్లోనే 148 పరుగులు నమోదు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌తోనే మహీ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరిగే ఐదో వన్డేలో టీమిండియాకు ధోని కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దీంతో, ఇక్కడ అతను మరోసారి చెలరేగితే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.