Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

56 పరుగుల దూరంలో ధోని: ఆ రికార్డుని సాధిస్తాడా?

విశాఖపట్నం: వన్డే సిరిస్ విజేత ఎవరో తేల్చే ఐదో వన్డే మ్యాచ్‌కి భారత్-న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా శనివారం ఐదో వన్డే జరగనుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఐదో వన్డేపైనే సిరీస్ ఫలితం ఆధారపడింది. ఐదో వన్డేతో ధోని కొన్ని అరుదైన రికార్డులను బద్ధలు కొట్టే అవకాశముంది. ముఖ్యంగా వైజాగ్‌ మైదానంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 2005లో ఇక్కడ పాకిస్థాన్‌పై ధోనీ.. 123 బంతుల్లోనే 148 పరుగులు నమోదు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌తోనే మహీ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.

వైజాగ్‌లో విరాట్‌కూ మెరుగైన రికార్డుంది. 2010లో ఆస్ట్రే‌లియా (118)పై, 2011లో వెస్టిండీస్‌ (117)పై సెంచరీలు చేశాడు. 2013లో వెస్టిండీస్‌పైనే 99 పరుగులతో తృటిలో శతకం చేజార్చుకున్నాడు. దీంతో, ఇక్కడ అతను మరోసారి చెలరేగితే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

విశాఖలో ఐదో వన్డే: న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తుందా?ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు జరగ్గా, నాలుగు మ్యాచ్ ల్లో టీమిండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లోనే ఓటమిపాలైంది. 2005లో ఇక్కడ జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్‌పై భారత్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత 2007లో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

 MS Dhoni writes his own destiny at Visakapatnam

ఇక 2010 ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 2011లో వెస్టిండిస్‌పై ఐదు వికెట్లతో విజయం నమోదు చేసింది. కాగా, 2013లో నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. కాగా, 2014లో అక్టోబర్‌లో వెస్టిండిస్‌తో జరగాల్సిన వన్డే మ్యాచ్ తుపాను కారణంగా రద్దైంది.

* ఇక భారత్‌లో నాలుగు వేల వన్డే పరుగులకి ధోని 56 పరుగుల దూరంలో ఉన్నాడు.
* క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (6976) తర్వాత స్వదేశంలో ఎక్కువ వన్డే పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ ధోనీనే కావడం విశేషం.
* అంతేకాదు ఈ మ్యాచ్‌తో 199 వన్డేలకి కెప్టెన్సీ వహించిన అరుదైన ఘనతను ధోనీ అందుకోనున్నాడు.
* ఈ మ్యాచ్‌లో ధోని రాణిస్తే భారత్‌ తరఫున వన్డేల్లో ఎక్కువ సిక్సర్లు (196) రికార్డుని మరింత మెరుగుపర్చుకునే అవకాశముంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+